Hyderabad: ఫిబ్రవరిలో అందుబాటులోకి ఎల్‌బి నగర్ ఆర్‌హెచ్ఎస్ అండర్ పాస్..
LB Nagar Under Pass: రహదారి వ్యవస్థను మరింత మెరుగు పరిచి ట్రాఫిక్ సమస్య నివారణకు నిర్ధిష్టమైన ప్రమాణాలతో..

LB Nagar Under Pass: హైదరాబాద్ నగరంలో రహదారి వ్యవస్థను మరింత మెరుగు పరిచి ట్రాఫిక్ సమస్యలను తగ్గవంచేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తోంది . ఇందులో భాగంగా నిర్ధిష్టమైన ప్రమాణాలతో రోడ్డు నిర్మాణాలు, అవసరమైన చోట అండర్ పాస్ లు, ఫ్లైఓవర్ లు, ఆర్.ఓ.బి నిర్మాణాలు చేపడుతోంది . ఈక్రమంలో నగరంలోని అత్యంత రద్దీ కూడలి అయిన ఎల్‌బి నగర్ సర్కిల్‌లో నిర్మించిన ఆర్‌హెచ్ఎస్ అండర్ పాస్ ఫిబ్రవరిలో అందుబాటులోకి రానుంది.
వ్యూహాత్మక రోడ్డు అభివృద్ది(SRDP) పథకం ద్వారా రూపొందించిన పలు రోడ్ల ప్రాజెక్టులను రూపొందించి, యుద్ధ ప్రాతిపదికన, ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు అధికారులు. నగరంలో ఎల్.బి నగర్ కూడలి అత్యంత ప్రధానమైనది. వరంగల్ నల్గొండ ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణకు, నివారణకు అండర్ పాస్, ఫ్లైఓవర్ నిర్మాణాలను చేపట్టారు. ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఆరాంఘర్, మిథాని మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను నివారించేందుకు ఎల్.బి నగర్ కుడాలి (RHS) కుడివైపు సివిల్ ఇతర పనులను చేపట్టేందుకు మొత్తం రూ. 14.87 కోట్ల వ్యయంతో 490 మీటర్ల పొడవు గల అండర్ పాస్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు.
ఈ అండర్ పాస్ 12.875 మీటర్ల వెడల్పు 7,250 మీటర్ల బాక్స్ పోర్షన్ 3 లైన్ ల యూని డైరెక్షన్ లో చేపట్టారు. సికింద్రాబాద్ రెటైనింగ్ బైరమల్ గూడ రిటైనింగ్ వైపు వాల్ లు నిర్మాణాలు అండర్ పాస్ నిర్మాణం వలన సిగ్నల్ ఫ్రీ రహదారిగా ఉప్పల్ నుండి మిథాని వరకు ట్రాఫిక్ సమస్య లేకుండా వెళ్లవచ్చు. దీని వలన వాహనాలు వేగంగా, కాలుష్యం తగ్గింపు అవుతుంది. ఆరాంఘర్ నుండి ఎల్.బి నగర్ వరకు వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా వెళ్లేందుకు వీలుగా ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టగా ఓవైసీ జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రారంభం కాగా బహద్దూర్ పుర ఫ్లైఓవర్ మార్చిలో ప్రారంభించేందుకు SRDP అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎల్.బి నగర్ అండర్ పాస్ తో పాటుగా తుకారాం గేట్ రైల్వే అండర్ పాస్ కూడా ఫిబ్రవరి మాసంలో అందుబాటులోకి తేనున్నారు.
Also read:
Health Tips: తిన్న తర్వాత ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. ఎందుకో తెలుసుకోండి..
Viral Video: అయ్య బాబోయ్ ఇదేం చలిరా.. ఇంట్లోకి పదండిరా.. వైరల్ వీడియోలో బాతుల ముచ్చట..
Lata Mangeshkar: కోలుకుంటున్న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్.. మంత్రి ఏమన్నారంటే..?
