హైదరాబాదీలు అటెన్షన్ ప్లీజ్.! ఇకపై పోలీసుల స్థానంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టేది..
సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇకపై పోలీసుల స్థానంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టేది ప్రత్యేక అధికారులట. ఇంతకీ వారెవరు.. ఆ వివరాలు ఇలా..
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టే పోలీసులు లేరని.. రయ్.. రయ్.. మంటూ వెళ్తున్నారా.? తస్మాత్ జాగ్రత్త.! ఇక నుంచి డ్రంక్ డ్రైవ్‌లో ఇప్పుడు పోలీసులు కాకుండా ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు . ఇక నుంచి వారే ట్రాఫిక్ నియంత్రణ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నారు. అసలు ఏంటి ఇది అనుకుంటున్నారా.? మరి లేట్ ఎందుకు చదివేయండి..
ఇది చదవండి: బంగారం కొనేవారికి శుభవార్త.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు
ఇక నుంచి ట్రాఫిక్ పోలీసుల అవతారంలో కనిపించనున్నారు ట్రాన్స్ జెండర్స్. సమాజంలో ఎక్కడో వివక్ష గురవుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తోంది సర్కార్. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నియంత్రణకు ట్రాన్స్ జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గతంలో నిర్ణయించిన విధంగా తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్లను నియమించాలని సూచించారు. సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్ల సేవలు వినియోగించుకోవాలన్నారు.
ఇది చదవండి: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్
నగరంలో నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్‌లోనూ వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. తద్వారా తాగి వాహనాలు నడపే వారి సంఖ్యను తగ్గించవచ్చన్నారు. వారికి హోమ్ గార్డ్ తరహాలో జీత భత్యాలను సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని, ప్రత్యేక డ్రెస్ కోడ్‌ను రూపొందించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం అదేశించారు.
ఇది చదవండి: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..