అజ్ఞాతంలోనే లగచర్ల దాడి నిందితుడు.. సురేష్ పట్టుబడితే బయటపడనున్న అసలు నిందితులు..!

లగచర్ల దాడి వెనుక మామూలు వ్యక్తులకు సాధ్యం కాదని సురేష్ వెనక ఎవరు పెద్దలు ఉండు ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సురేష్ పట్టుపడితే ఈ కేసులో అసలు నిందితులు ఎవరి అనేది తెలిసే అవకాశం ఉందంటున్నారు.

అజ్ఞాతంలోనే లగచర్ల దాడి నిందితుడు.. సురేష్ పట్టుబడితే బయటపడనున్న అసలు నిందితులు..!
Lagacharla Incident
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Balaraju Goud

Updated on: Nov 15, 2024 | 8:56 AM

వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారుల బృందంపై జరిగిన దాడి వెనుక ఉన్న అసలు సూత్రధారులను కనిపెట్టడంపై దృష్టి సాధించిన పోలీస్ శాఖ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకునేందుకు అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ దాడిని ప్రోత్సహించింది రాజకీయ నాయకుల అని భావిస్తున్న పోలీసులు పక్కా ఆధారాలను సేకరిస్తుంది.

ఇప్పటికే ఈ కేసులో కొడంగల్ మార్చి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకే దాడి జరిగిందని నరేందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో రానున్న రోజుల్లో మరికొందరు నాయకులు అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే నరేందర్ రెడ్డి సెల్‌ఫోన్‌ జప్తు చేసిన పోలీసులు న్యాయస్థానం అనుమతితో మొబైల్ ఫోన్‌పై దృష్టి పెట్టనున్నారు. ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్త సురేష్, పట్నం నరేందర్ రెడ్డికి ఇటీవల కాలంలో 84 సార్లు ఫోన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. తాజాగా కేటీఆర్ తో నరేందర్ రెడ్డి జరిపిన సంభాషణల వివరాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వారి వాట్సాప్, వాయిస్ కాల్స్‌లపై దృష్టి పెట్టారు పోలీసులు.

అయితే ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న సురేష్ ఆచూకీ మాత్రం లభించడం లేదు. ఘటన జరిగిన రోజు పరారైన సురేష్ మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు అతను ఎక్కడున్నాడో ఆచూకీ లేదు. ఇది అనుమానాలకు తావిస్తోందని పోలీసులు అంటున్నారు. దాడి తర్వాత తలెత్తే పరిణామాలను ఊహించి పారిపోవడానికి అజ్ఞాతంలో ఉండడానికి పక్కాగా ఏర్పాట్లు చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

సంఘటన జరిగిన వెంటనే స్పందించిన ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేయడం మొదలుపెట్టారు. ఈలోపే సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అంత త్వరగా తమ కళ్ళు కప్పి పారపోవడం మామూలు వ్యక్తులకు సాధ్యం కాదని సురేష్ వెనక ఎవరో పెద్దలు ఉండి ఉంటారని పోలీసులు చెబుతున్నారు సమీపంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు సురేష్ పట్టుబడితే ఈ కేసులో అసలు నిందితులు ఎవరు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ఈ నేపథ్యంలోనే అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ఆధ్యర్యంలో విచారణ వేగవంతమైంది. ఈ క్రమంలోనే పరిగి పోలీస్ స్టేషన్‌లో ఆరు గంటల పాటు సుదీర్ఘ విచారణ చేసిన అడిషనల్ డీజీ మహేష్ భగవత్, ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ చాటింగ్‌ విశ్లేషణపై దృష్టి పెట్టారు. లగచర్ల దాడి కేసులో కేటీఆర్ ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. పట్నం నరేందర్ రెడ్డితో ఇటీవల కాలంలో 84 సార్లు సురేష్ మాట్లాడినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. అజ్ఞాతంలో ఉన్న సురేష్‌ దొరికితే గానీ అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా కనిపించడం లేదు. అతని కోసం మూడు రోజులుగా గాలిస్తున్నారు పోలీసులు. కాగా, మామూలు వ్యక్తులకు సాధ్యం కాదని సురేష్ వెనక ఎవరు పెద్దలు ఉండు ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సురేష్ పట్టుపడితే ఈ కేసులో అసలు నిందితులు ఎవరి అనేది తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…