Telangana: ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరుచుకునే ఆలయం.. ఎక్కడుందో తెల్సా
కొన్ని ఆలయాల్లో కొన్ని నెలల పాటు తెరిచి మళ్లీ మూసివేస్తారు. ఇక్కడ మాత్రం ఏడాదికి కేవలం ఒకరోజు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. అప్పుడే స్వయంభుగా వెలిసిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు.
సాధారణంగా ఏ దేవాలయంలోనైనా.. ఏడాది పొడవునా పూజలు జరుగుతుంటాయి. దేవతా మూర్తులకు నిత్య కైంకర్యాలు జరుగుతాయి, భక్తులు కూడా పూజలు చేస్తుంటారు. కొన్ని ఆలయాల్లో కొన్ని నెలల పాటు తెరిచి మళ్లీ మూసివేస్తారు. ఇక్కడ మాత్రం ఏడాదికి కేవలం ఒకరోజు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. అప్పుడే స్వయంభుగా వెలిసిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఏడాదిలో ఒకరోజు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇది చదవండి: గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్
యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిల్లాపురంలో ఓ ఎత్తైన గుట్ట పైన 90 ఏళ్ల క్రితం శ్రీ రామలింగేశ్వర స్వామి వెలిసినట్టు స్థల పురాణం చెబుతోంది. ఆ గుట్టను రామస్వామి గుట్టగా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. స్వయంభుగా వెలిసిన ఈ ఆలయం ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే తెరుచుకుంటుంది. ఆ రోజు కోసం సమీప గ్రామాల ప్రజలు ఆ శివశంకరుడి దర్శనానికి ఎదురు చూస్తుంటారు.
ఇది చదవండి: అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు
ఆ ఒక్క రోజే వేల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు. ప్రతి ఏటా కార్తిక పౌర్ణమి రోజున ఈ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. కార్తీక పౌర్ణమి రోజున పరిసర గ్రామాల ప్రజలు ఒక్కరోజు జాతర నిర్వహిస్తుంటారు. తెల్లవారుజామున శివునికి రుద్రాభిషేక పర్వంతో జాతర ప్రారంభమవుతుంది. గుడి పక్కనే పుట్ట వద్ద నాగదేవతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. మహిళలు ప్రత్యేకంగా 360 ఒత్తులతో దీపాలను వెలిగించి పూజలు చేస్తారు. సాయంత్రం అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి స్వామివారి ఆలయం తలుపులను మూసివేస్తారు. తిరిగి ఏడాది తర్వాత ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. అయితే ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున ఆలయం తెరుచుకోవడం ఇక్కడి విశేషం.
ఇది చదవండి: విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..