SCR: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. ఆ నగరాల మధ్య నడిచే పలు రైళ్లు రద్దు

రైల్వే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) కీలక సూచనలు చేసింది. కొన్ని రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. మరి కొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది. కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల...

SCR: రైల్వే ప్రయాణీకులకు అలర్ట్.. ఆ నగరాల మధ్య నడిచే పలు రైళ్లు రద్దు
Secunderabad Railway
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 26, 2022 | 9:19 AM

రైల్వే ప్రయాణీకులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) కీలక సూచనలు చేసింది. కొన్ని రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. మరి కొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది. కాజీపేట-బల్లార్ష సెక్షన్‌లో నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ప్రయాణీకులు ఈ మార్పులను గమనించాలని కోరారు. సిర్పూర్ కాగజ్ నగర్ – సికింద్రాబాద్, సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్, కాజీపేట – సిర్పూర్ టౌన్, బల్లార్ష – సిర్పూర్ టౌన్, హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్, భద్రాచలం రోడ్ – బల్లార్ష, వరంగల్ – బల్లార్ష, సిర్పూర్ టౌన్ – భద్రాచలం రోడ్, తిరుపతి – జమ్ముతావి, దానాపూర్ – సికింద్రాబాద్, పెద్దపల్లి – నిజామాబాద్ – సికింద్రాబాద్ రైళ్లల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. 12757 నంబర్ గల సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, 12758 సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌, 17003 కాజీపేట-సిర్పూర్‌టౌన్‌, 17004 బల్లార్ష-సిర్పూర్‌టౌన్‌ రైళ్లను జూన్‌ 27 నుంచి జులై 20 వరకు రద్దు చేశారు. 17001 హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, 17002 సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-హైదరాబాద్‌ రైళ్లనూ రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

17003 భద్రాచలం రోడ్‌-బల్లార్ష రైలు జూన్ 27 నుంచి జూలై 20 వరకు వరంగల్‌-బల్లార్ష మధ్య రద్దయ్యింది. 17034 సిర్పూర్‌ టౌన్‌-భద్రాచలం రోడ్‌ జూన్‌ 27 నుంచి జులై 20 వరకు సిర్పూర్‌ టౌన్‌-వరంగల్‌ మధ్య, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ రైలు జూన్‌ 27 నుంచి జులై 20 వరకు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-కాజీపేట మధ్య రద్దయ్యాయి.

22705 తిరుపతి-జమ్ముతావి రైలు జులై 5, 12, 19 తేదీల్లో సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, ముద్కేడ్‌, పింపల్‌కుట్టి మీదుగా దారి మళ్లించారు. సికింద్రాబాద్‌-దానాపూర్‌, దానాపూర్‌-సికింద్రాబాద్‌ రైళ్లను జూన్‌ 26 నుంచి జులై 19 వరకు పెద్దపల్లి-నిజామాబాద్‌-సికింద్రాబాద్‌ మీదుగా దారి మళ్లించి నడిపిస్తారు. ప్రయాణీకులు ఈ మార్పులను గమనించాలని అధికారులు కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..