AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రోజురోజుకు పెరిగిపోతున్న టమాటా ధరలు.. రేట్ల మంటతో జేబుకు చిల్లు

కూరగాయల్లో టమాటా(Tomato) ప్రధానం. ఏ కూర వండుకున్నా అందులో టమాటా ఉండాల్సిందే. వంటింట్లో ఏ కూరగాయ లేకున్నా.. టమాటా మాత్రం ఉండాల్సిందే. అయితే గత కొద్ది రోజులుగా టమాటా ధరలు మంటెక్కిపోతున్నాయి. నెల రోజుల క్రితం ధర...

Hyderabad: రోజురోజుకు పెరిగిపోతున్న టమాటా ధరలు.. రేట్ల మంటతో జేబుకు చిల్లు
Tomato Price Hike
Ganesh Mudavath
|

Updated on: Apr 30, 2022 | 4:19 PM

Share

కూరగాయల్లో టమాటా(Tomato) ప్రధానం. ఏ కూర వండుకున్నా అందులో టమాటా ఉండాల్సిందే. వంటింట్లో ఏ కూరగాయ లేకున్నా.. టమాటా మాత్రం ఉండాల్సిందే. అయితే గత కొద్ది రోజులుగా టమాటా ధరలు మంటెక్కిపోతున్నాయి. నెల రోజుల క్రితం ధర లేక నేల చూపులు చూసిన టమాటా ఇప్పుడు మోత మోగిస్తోంది. కిలో ధర ఏకంగా రూ. 40కి పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో రూ.50పలుకుతోంది. రైతుబజార్లలోనే అధికారికంగా కిలో రూ.28కి నిర్ణయించారు. ఇక ఏసీ పెట్టి అమ్మే దుకాణాల్లో అయితే ఏకంగా రూ.60కి అమ్మేస్తున్నారు. మరోవైపు.. వేసవి కావడంతో ఎండల వేడిమికి పంటలు ఎండిపోయాయి. హైదరాబాద్(Hyderabad) నగరానికి జిల్లాల నుంచి విపరీతంగా వచ్చే టమాటా పంట ఇప్పుడు కనుమరుగైంది. ఇతర కూరగాయల పంటలన్నీ ఎండిపోవడంతో పాలీ హౌస్‌ల ద్వారా పండించినవే ఇప్పుడు మార్కెట్‌కు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూరగాయల సరకులు వస్తుండటంతో రవాణా ఖర్చులు కూడా కలపడంతో ధరలు పెరిగిపోయాయి. ఆకస్మాత్తుగా పెరిగిపోయిన ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలో కొనే వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు. టమాటాలే కాకుండా ఇతర కూరగాయల లభ్యత కూడా తక్కువగా ఉంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Climate change: వెన్నులో వణుకు పుట్టించే న్యూస్.. 2070నాటికి భూమ్మీద నివసించలేని పరిస్థితి!

Border Drone: పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి మేడిన్ చైనా డ్రోన్‌.. కాల్చేసిన భద్రతా దళాలు