AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఈ దొంగ స్టైలే వేరప్ప..! ఇప్పుడే వస్తానంటాడు.. ఇక అంతే.. Viral Video

Hyderabad Old City: మొహంపై మాక్స్.. తలపై టోపీ.. చాలా నీతి నిజాయితీగా బుద్ధిమంతుడిలా కనిపిస్తాడు.. కొత్త నెంబర్ ప్లేట్‌తో ఉన్న ద్విచక్రవాహనంపై వచ్చి మాట కలుపుతాడు. ఇంతలోనే వారు పసిగట్టే లోపే మోసం చేసి ఉడాయిస్తాడు.

Hyderabad: ఈ దొంగ స్టైలే వేరప్ప..! ఇప్పుడే వస్తానంటాడు.. ఇక అంతే.. Viral Video
Hyderabad
Shaik Madar Saheb
|

Updated on: Apr 30, 2022 | 9:15 AM

Share

Hyderabad Old City: మొహంపై మాక్స్.. తలపై టోపీ.. చాలా నీతి నిజాయితీగా బుద్ధిమంతుడిలా కనిపిస్తాడు.. కొత్త నెంబర్ ప్లేట్‌తో ఉన్న ద్విచక్రవాహనంపై వచ్చి మాట కలుపుతాడు. ఇంతలోనే వారు పసిగట్టే లోపే మోసం చేసి ఉడాయిస్తాడు. హైదరాబాద్ పాత బస్తీలో సంచరిస్తూ డబ్బులు దండుకుంటున్న ఈ దొంగ గురించి పలువురు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ దొంగ.. క్లాస్ గా కిరాణా, దుస్తుల షాపులో కొనుగోలు కోసం వచ్చినట్టు వస్తాడు. ఆ తర్వాత మాట కలుపుతాడు. సరుకులు, దుస్తులు తీసి ప్యాకింగ్ చేయిస్తాడు.. ఇంతలోనే ఫోన్ వచ్చినట్టు నటించి వ్యాపారస్తుల దగ్గర, వంద రూపాయల నోట్లు ఒక 20,000 & 50 రూపాయల నోట్లు ఒక 10,000 ఉంటే ఇవ్వండి నేను ఆన్ లైన్ పేమెంట్ చేస్తానంటూ చెబుతాడు. వారు ఒప్పుకోకపోయినా ఇప్పుడే పంపుతానంటూ నమ్మిస్తాడు. డబ్బులు తీసుకున్న తర్వాత.. పేమెంట్ కావడం లేదని.. ఏటీఎం దగ్గర తీసి ఇస్తానని.. తోడుగా ఎవరినో ఒకరిని తనతో పంపించండి అంటూ అడుగుతాడు.

ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసి ఇస్తానంటూ వారిని తీసుకెళ్తాడు.. ఎవరైతే అతనికి తోడుగా వచ్చి ఉంటారో వాళ్లకి వంద రూపాయలు ఇచ్చి బేకరీ నుంచి ఫలానా వస్తువు తీసుకురమ్మంటూ మార్గమధ్యలోనే పంపిస్తాడు. ఇంతలోనే ఈ దొంగ పారిపోతాడు. పాతబస్తీ మీర్ ఆలం మండి మలక్ పేట్ నాంపల్లి ఏరియా లతోపాటు నగరంలోని పలు ఏరియాల్లో.. ఈ దొంగ లక్షలాది రూపాయలు దోచుకుని వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం.. రంజాన్ పర్వదినం దగ్గరపడుతుండటంతో చార్మినార్ సహా పలు ప్రాంతాల్లో షాపింగ్ కోసం జనం పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి దొంగల దోపిడి పెరిగిపోయిందని పలు షాపుల యజమానులు పేర్కొంటున్నారు. కాగా.. ఈ దొంగపై ఇప్పటికే నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో షాపుల యజమానులు అలర్ట్ అయ్యారు. ఇలాంటి దొంగ మీ దగ్గరకు కూడా రావొచ్చు.. జాగ్రత్తగా ఉండాలంటూ మోసపోయిన వ్యాపారస్తులు.. ఇతర వ్యాపార వస్తువులను అలర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వ్యాపార వర్గాల్లో, నెట్టింట హల్‌చల్‌గా మారింది.

-నూర్ మహమ్మద్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Bank Holidays in May 2022: మే నెలలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు అంటే..

Heatwave: మాడు పగిలిపోద్ది.. ఆ ఐదు రాష్ట్రాలను హెచ్చరించిన IMD.. ఢిల్లీలో రికార్డు బద్దలు..