Heatwave: మాడు పగిలిపోద్ది.. ఆ ఐదు రాష్ట్రాలను హెచ్చరించిన IMD.. ఢిల్లీలో రికార్డు బద్దలు..

Heatwave in India: భానుడు మాంచి ఫామ్‌లోకి వచ్చాడు. మాడు పగలగొడుతున్నాడు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వడగాల్పులు ఉక్కిరికిబిక్కిరి చేస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో

Heatwave: మాడు పగిలిపోద్ది.. ఆ ఐదు రాష్ట్రాలను హెచ్చరించిన IMD.. ఢిల్లీలో రికార్డు బద్దలు..
Heatwave
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 30, 2022 | 8:37 AM

Heatwave in India: భానుడు మాంచి ఫామ్‌లోకి వచ్చాడు. మాడు పగలగొడుతున్నాడు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వడగాల్పులు ఉక్కిరికిబిక్కిరి చేస్తున్నాయి. రికార్డ్ స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు హాఫ్ సెంచరీని సమీపిస్తున్నాయి. ఢిల్లీ, యూపీ, రాజస్థాన్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశాకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేసింది. పలుచోట్ల టెంపరేచర్స్‌ 46 డిగ్రీల సెల్సియస్‌ దాటిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో 47డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. సాధారణం కంటే 2,3 డిగ్రీల ఎక్కువ టెంపరేచర్‌ నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. కాగా.. వాయువ్య భారత దేశంలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని.. రెండు రోజుల తర్వాత కూడా పరిస్థితిలో మార్పు ఉండదని..మరింత తీవ్రమవుతాయని హెచ్చరించింది.

కాలు బయట పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. IMD కూడా ఇదే హెచ్చరిక చేస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించింది. అత్యవసరమైతే తగిన ఏర్పాట్లు చేసుకుని బయట వెళ్లండని నిపుణులు చెప్తున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలో..

దేశ రాజధాని ఢిల్లీలో రికార్డ్‌ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఏప్రిల్‌లో సెగలు పుట్టిస్తున్నాడు భానుడు. 43.5డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక గుర్‌గావ్‌లో అయితే 45.6డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్‌ రికార్డైంది.

ఢిల్లీలో 1941 ఏప్రిల్‌ 29న 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే ఆల్‌ టైమ్‌ హై టెంపరేచర్‌. ఇక 2010 ఏప్రిల్‌ 18న 43.7డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవగా..తాజాగా మళ్లీ ఆస్థాయిలో హీట్‌ వేవ్స్‌ రికార్డయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

Punjab Violence: పాటియాలాలో హింస దురదృష్టకరం.. చర్యలు తీసుకుంటాం: సీఎం భగవంత్ మాన్

PM Narendra Modi: నేడు సీఎంలు, న్యాయమూర్తుల సదస్సు.. ప్రసంగించనున్న ప్రధాని మోడీ, సీజేఐ రమణ..