PM Narendra Modi: నేడు సీఎంలు, న్యాయమూర్తుల సదస్సు.. ప్రసంగించనున్న ప్రధాని మోడీ, సీజేఐ రమణ..

PM Modi to address CMs, CJs Conference: సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో ఢిల్లీలో ఈ రోజు మరో కీలక సమావేశం జరగనుంది. హైకోర్టు సీజేలు, ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశం ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించనున్నారు.

PM Narendra Modi: నేడు సీఎంలు, న్యాయమూర్తుల సదస్సు.. ప్రసంగించనున్న ప్రధాని మోడీ, సీజేఐ రమణ..
Pm Modi And Cji Nv Ramana
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 30, 2022 | 8:39 AM

PM Modi to address CMs, CJs Conference: సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో ఢిల్లీలో ఈ రోజు మరో కీలక సమావేశం జరగనుంది. హైకోర్టు సీజేలు, ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశం ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహించనున్నారు. ఈ కాన్ఫరెన్స్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి ప్రసంగించనున్నారు. విజ్ఞాన్ భవన్ వేదికగా జరగనున్న ఈ సదస్సులో (judicial conference) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 25 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొననున్నారు. సదస్సు అజెండాలో 6 ప్రధానాంశాలు ఉండనున్నాయి. ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభం కానుంది. న్యాయమూర్తుల సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొననున్నారు. తెలంగాణ తరపున సదస్సులో న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొననున్నారు.

ప్రస్తుతం దేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి..? అనే విషయంపై చర్చించేందుకు ఈ సమావేశం వేదిక కానుంది.బాధితులకు సులభంగా, త్వరగా న్యాయం అందించే విధి విధానాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. నిన్న హైకోర్టుల సీజేల సదస్సు ఆరేళ్ల గ్యాప్‌ తర్వాత సీజేఐ ఎన్వీ రమణ చొరవతో జరిగింది. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఆరేళ్ళ తరువాత ఈ భేటీ జరుగుతోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలాఉంటే.. బీహార్ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఈ రోజు జరిగే ముఖ్యమంత్రుల సమావేశానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం.. రాష్ట్రంలో మిత్రపక్షమైన బీజేపీ తీరుపై నితీశ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Also Read:

ఉష్ణోగ్రతల్లో మార్పులతో భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. 2 లక్షల మెగావాట్లు దాటిన డిమాండ్.. గతేడాది రికార్డ్ బ్రేక్..

Power Crisis: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న విద్యుత్ కోతలు.. అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!