Gold Silver Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు

Gold Silver Price Today: దేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు మహిళలు. ఇక ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో పెరుగుతూ.. తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు...

Gold Silver Price Today: మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజా రేట్ల వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Apr 30, 2022 | 6:19 AM

Gold Silver Price Today: దేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు మహిళలు. ఇక ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో పెరుగుతూ.. తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. తాజాగా ఎగబాకాయి. శనివారం (ఏప్రిల్‌ 30)న దేశీయంగా బంగారం (Gold), వెండి (Silver) ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల బంగారం ధరపై రూ.550 వరకు పెరిగింది. ఇక కిలో వెండిపై స్వల్పంగా అంటే రూ.200 వరకు పెరిగింది. అయితే బంగారం, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,960 ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,960 వద్ద ఉంది.

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,960 ఉంది.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,970 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,420 వద్ద ఉంది.

☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,960 వద్ద కొనసాగుతోంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,960 ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,960 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,960 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,000 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.69,200 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.69,200 ఉండగా, చెన్నైలో రూ.69,200 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.64,000 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.69,200 ఉంది. ఇక కేరళలో రూ.69,200 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు షాక్‌.. ఈ ప్రాంతాల్లో రైళ్లు రద్దు!

SBI: క్రెడిట్‌, డెబిట్‌ కార్డు లావాదేవీల సురక్షితం కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక మార్గదర్శకాలు!