Coal Shortage: దేశంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్.. థర్మల్‌ విద్యుత్ ప్లాంట్లను వేధిస్తున్న బొగ్గు కొరత..

ఈ సంవత్సరం వేసవి(Summer) ప్రారంభంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. దేశం అంతటా వేడి పెరగడంతో విద్యుత్‌(Power) డిమాండ్ పెరిగింది...

Coal Shortage: దేశంలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్.. థర్మల్‌ విద్యుత్ ప్లాంట్లను వేధిస్తున్న బొగ్గు కొరత..
Coal Mine
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 29, 2022 | 5:28 PM

ఈ సంవత్సరం వేసవి(Summer) ప్రారంభంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. దేశం అంతటా వేడి పెరగడంతో విద్యుత్‌(Power) డిమాండ్ పెరిగింది. అనేక రాష్ట్రాలు విద్యుత్ డిమాండ్‌ను తీర్చలేకపోతున్నాయి. అనేక నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్(AP), కర్ణాటక(Karnataka), బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పంజాబ్, హర్యానాలో వేసవి ప్రారంభం నుంచి విద్యుత్ కోతలు విధించినట్లు నివేదికలు తెలిపాయి. బొగ్గు గనులు ఉన్న ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా కరెంటు కోతలు తప్పడం లేదు. జార్ఖండ్‌ ప్రభుత్వ యాజమాన్యంలోని పవర్ తెనుఘాట్ థర్మల్ పవర్ స్టేషన్‌లో కేవలం 17.6 MT బొగ్గు ఉంది. బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర కూడా వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా తగ్గించినట్లు తెలుస్తుంది. అయితే తమ రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని మహా సర్కార్‌ తేల్చి చెప్పింది. గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ప్రభుత్వరంగ సంస్థలను ఖరీదైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు అనుమతించడం కోతలు తగ్గుతున్నాయి.

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ కారణంగా దేశంలో పలు నగరాలలు లోడ్ షెడ్డింగ్‌ను ఎదుర్కొంటున్నాయి. ఏప్రిల్ 26న దేశ పవర్ గ్రిడ్ 201 GW రికార్డు డిమాండ్‌ను ఎదుర్కొంది. అంతకు ముందు 2021 జూలై 7న 200 GW డిమాండే ఇప్పటి వరకు అత్యధికంగా ఉండేది. అయితే విద్యుత్‌ డిమాండ్‌ అకస్మాత్తుగా ఏం పెరగలేదు. రాయిటర్స్ ప్రకారం ఈ సంవత్సరం మార్చి మధ్య నుంచి గ్రిడ్‌లు 195 GW పైన డిమాండ్‌ ఎదుర్కొన్నాయి. ఇళ్లలో ACల వినియోగం పెరిగింది. మార్చి, ఏప్రిల్‌ నెలలో ఉష్ణోగ్రతలో అసాధారణ పెరుగుదలను కనిపిస్తోంది. అధిక ఉష్ణోగ్రత అంటే ACలు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రిక్ ఫ్యాన్ల వంటి ఇతర ఉపకరణాల వినియోగం పెరిగాయి. “ఎయిర్ కండిషనింగ్ వాడకం పెరగడం వల్ల అర్ధరాత్రి తర్వాత గరిష్ఠ డిమాండ్ పెరుగుతోంది” అని ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ హ్యారీ ధౌల్ రాయిటర్స్‌తో అన్నారు. కానీ నివాసాలు మాత్రమే కాదు కార్యాలయాలు, వాణిజ్యపరంగా కూడా విద్యుత్‌కు అధిక డిమాండ్ ఉంది.

లోడ్-షెడ్డింగ్ వెనుక ఉన్న ప్రధాన కారణాలలో ఒకటి బొగ్గు కొరత. పవర్ గ్రిడ్ ద్వారా నడుస్తున్న మొత్తం విద్యుత్‌లో దాదాపు 75 శాతం బొగ్గును నుంచే ఉత్పత్తి అవుతుంది. ఏప్రిల్ 26 నాటికి భారతదేశంలో 202.7 GW ఉత్పత్తి సామర్థ్యంతో 165 బొగ్గు ఆధారిత ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్‌లలోని 66.32 మిలియన్ టన్నుల అవసరమైన బొగ్గు అవసరం కాగా 21.44 మిలియన్ టన్నులు మాత్రమే ఉంది. దేశీయ బొగ్గును ఉపయోగించే 150 బొగ్గు విద్యుత్ ప్లాంట్లలో 85 పాంట్లలో బొగ్గు తక్కువగా ఉంది. దిగుమతి చేసుకున్న బొగ్గును ఉపయోగించే 15 ప్లాంట్లలో 12 ప్లాంట్లలో బొగ్గు కొరత ఉంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) డేటా ప్రకారం.. విద్యుత్ ప్లాంట్‌ను కేంద్రం, రాష్ట్రాలు, జాయింట్ వెంచర్లు లేదా ప్రైవేట్‌గా నిర్వహిస్తున్నా అనే దానితో సంబంధం లేకుండా బొగ్గు కొరత కనిపిస్తుంది. దేశం అంతటా పెరుగుతున్న ఉష్ణోగ్రత చాలా మంది ప్రజలను కలవరపెడుతోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం థర్మల్ పవర్ ప్లాంట్‌లకు బొగ్గు సరఫరా చేయకుండా రాష్ట్రాన్ని ఎలా అడ్డుకుంటారని ప్రతిపక్ష ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తున్నారు. ఇదిలా ఉండగా, బొగ్గు సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు కేంద్రానికి (బొగ్గు మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ) లేఖలు రాస్తున్నారు.

థర్మల్ పవర్ స్టేషన్లు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయనడంలో సందేహం లేదు. పని చేస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్‌లలో సగానికి పైగా ప్లాంట్లు బొగ్గు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. బొగ్గు కొరతపై కేంద్ర మంత్రుల మాటలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. బొగ్గు కొరత లేదని బొగ్గు మంత్రిత్వ శాఖ చెప్పగా.. తమ వద్ద్ రైల్వే వ్యాగన్‌లు లేవని రైల్వే మంత్రిత్వ శాఖ చెబుతుంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా దిగుమతి చేసుకునే బొగ్గు ధర పెరిగింది. దీంతో ఈ పవర్ ప్లాంట్లు దేశీయ బొగ్గును ఉపయోగించడం ప్రారంభించాయి. కానీ బొగ్గు గనులకు, ప్లాంట్లు దూరం ఉండడంతో సమస్య తలెత్తుతుంది. కోస్టల్ పవర్ ప్లాంట్‌లకు బొగ్గు రవాణా చేయడానికి ఉపయోగించే రైలు రేకులు తిరిగి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే బొగ్గు కొరత కూడా కొత్త సమస్య కాదు. పవర్ ప్లాంట్‌లలోని విద్యుత్ ఉత్పత్తిదారుల బొగ్గు నిల్వలు 2014 నుంచి తగ్గుతూ వస్తు్న్నాయి.

వేసవిని తట్టుకునేందుకు ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు, ఇతర కూలింగ్ ఉపకరణాలు ఎక్కువగా వినియోగించడం వల్ల విద్యుత్‌ డిమాండ్‌ పెరిగి పవర్ గ్రిడ్‌లపై చాలా ఒత్తిడి తెచ్చిందని నిపుణులు తెలిపారు. అయితే, యుటిలిటీ కంపెనీలు దీని కోసం ముందుగానే సిద్ధంగా ఉండకూడదా? అని ప్రశ్నలు వస్తు్న్నాయి. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తిదారుగా ఉంది. అయితే తలసరి వినియోగంలో 106వ స్థానంలో ఉంది. దేశ మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 399.5 GW కాగా అందులో 289.6 GW మానిటర్ సామర్థ్యంతో ఉంది. ఇందులో 236 GW బొగ్గు లేదా ఇంధనంతో నడిచేవి, 46.7 GW జలవిద్యుత్, 6.7 GW అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నాయి. దాదాపు 109.8 GW పునరుత్పాదక ఇంధన వనరుల రూపంలో ఉంది. గరిష్ట డిమాండ్ 198.4 GW కాగా కానీ దేశం 188.1 GW మాత్రమే ఉత్పత్తి చేయలగలిగింది.

ఆర్థిక సర్వే 2020-21 ప్రకారం, 2001-02 నుంచి మెరుగుదల ఉన్నప్పటికీ ట్రాన్స్‌కోలు, డిస్కాంలు నష్టాలు 20 శాతానికి పైగానే ఉన్నాయి. T&D నష్టాలు 2017-18లో 21.04 శాతం నుంచి 2018-19లో 20.66 శాతానికి తగ్గాయి. ట్రాన్స్‌మిషన్ లైన్ నష్టాలను తగ్గించడానికి ప్రభుత్వం “స్మార్ట్ గ్రిడ్”ను ప్రారంభించినప్పటికీ, డిస్కమ్‌లలో ద్రవ్య కొరత ఏర్పడటానికి విధాన-స్థాయి జోక్యం అవసరం. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను అధిగమించడానికి ఏకైక మార్గం మరింత విద్యుత్ ఉత్పత్తి చేయడం. పునరుత్పాదక ఇంధన వనరులు ఇప్పటికే మొత్తం స్థాపిత సామర్థ్యంలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి.2022 చివరి నాటికి పునరుత్పాదక శక్తి యొక్క 175 GW స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. (Source)

Read Also.. Amazon Prime Videos: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త సినిమాలకు ముందుగానే యాక్సెస్..