Uttar Pradesh: లౌడ్ స్పీకర్ల సౌండ్ పై యోగి సర్కార్ నయా రూల్స్.. ఆలా జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు

శబ్ధ కాలుష్యాన్ని నియంత్రించే దిశగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గడిచిన నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 10,923 అక్రమ లౌడ్ స్పీకర్లను మతపరమైన ప్రదేశాల నుంచి....

Uttar Pradesh: లౌడ్ స్పీకర్ల సౌండ్ పై యోగి సర్కార్ నయా రూల్స్.. ఆలా జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు
Loud Speakers
Follow us

|

Updated on: Apr 29, 2022 | 5:56 PM

శబ్ధ కాలుష్యాన్ని నియంత్రించే దిశగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గడిచిన నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 10,923 అక్రమ లౌడ్ స్పీకర్లను మతపరమైన ప్రదేశాల నుంచి తొలగించింది. అంతే కాకుండా 35,221 లౌడ్ స్పీకర్ల(Loud Speakers) సౌండ్ ను అనుతిచ్చిన పరిధి మేరకే పెట్టుకోవాలని సూచించింది. యూపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాల మేరకు అధికారులు ఈ చర్యలు చేపట్టారు. పలు జిల్లాల్లో హిందూ, ముస్లిం సంఘాలు ఒక్కటై.. లౌడ్ స్పీకర్ల సౌండ్ పరిమాణాన్ని తగ్గించేందుకు ముందుకొచ్చాయని ఆ రాష్ట్ర హోం మంత్రి తెలిపారు. లౌడ్ స్పీకర్లను తొలగించడం, వాటి శబ్ధాన్ని తగ్గించడం వంటి చర్యలతో ఉత్తరప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అలీఘర్‌లోని మసీదుల్లో లౌడ్‌స్పీకర్‌ల వినియోగంపై తీవ్ర వివాదం చెలరేగింది. నగరంలోని మసీదుల్లో వినియోగిస్తున్న లౌడ్‌ స్పీకర్ల వివరాలను అందించాలని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ముక్తా రాజా.. జిల్లా అధికారులను కోరారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా లౌడ్ స్పీకర్లను వినియోగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మే 3న వచ్చే అక్షయ తృతీయ, రంజాన్ పర్వదినాల సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం యోగి ఆదేశించారు. శ్రీరామనవమిని శాంతియుతంగా జరుపుకున్నామని, యూపీ అల్లర్లు లేకుండా ఉండగలదని తాము నిరూపించామని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని మతాలకు పూర్తి గౌరవం ఉందని, మతపరమైన ఆచార వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని వెల్లడించారు. అయితే సామాన్య ప్రజలను వేధించవద్దని ముఖ్యమంత్రి సూచించారు. లఖ్ నవూ ఈద్గా ఇమామ్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) సీనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహలీ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు కమ్యూనిటీ ఖచ్చితంగా కట్టుబడి ఉంటుందని ఆల్ ఇండియా షియా పర్సనల్ లా బోర్డు (AISPLB) ప్రధాన కార్యదర్శి మౌలానా యాసూబ్ అబ్బాస్ అన్నారు.

అన్ని దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, ఇతర మతపరమైన ప్రదేశాలలో స్పీకర్లను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉపయోగించుకోవాలని లఖ్ నవూ పోలీస్ కమిషనర్ డీకే.ఠాకూర్ కోరారు. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2005 జులైలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య (పబ్లిక్ ఎమర్జెన్సీ కేసులు మినహా) బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు, మ్యూజిక్ సిస్టమ్‌ల వినియోగాన్ని సుప్రీం కోర్టు నిషేధించింది. శబ్ధ కాలుష్యం వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతూ కోర్టు ఈ తీర్పును ఇచ్చింది.

సుప్రీంకోర్టుతో పాటు యూపీ, కర్ణాటక, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ వంటి వివిధ రాష్ట్రాల హైకోర్టులు.. ముంబయిలో చాలా సంవత్సరాలుగా లౌడ్ స్పీకర్ల పరిమాణాన్ని నియంత్రించించని, అక్కడ అమలు చేస్తున్న చర్యలను మన రాష్ట్రాల్లోనూ అమలు పరచాలని తీర్పునిచ్చాయి. లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం ప్రాథమిక హక్కు కాదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా లౌడ్ స్పీకర్లను లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను ఉపయోగించే హక్కు లేదని 2016 లో బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది.  నీటి కాలుష్యం, వాయు కాలుష్యం మాదిరిగా శబ్ధ కాలుష్యంపై ఎవరూ శ్రద్ధ తీసుకోవడం లేదు. కానీ ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీ చదవండి

Indian Railway: అర్థాంతరంగా రద్దవుతున్నాయి.. ఆలస్యంగా గమ్య స్థానాలకు చేరుతున్నాయి.. రైల్వే తీరుతో ప్రయాణికులు సతమతం