Power Crisis: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న విద్యుత్ కోతలు.. అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం..

Power Crisis: ఓవైపు ఎండలతో జనం పరేషాన్‌ అవుతుంటే.. మరోవైపు కరెంట్‌ కోతలు నరకాన్ని చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం నెలకొంది.

Power Crisis: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న విద్యుత్ కోతలు.. అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం..
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 29, 2022 | 11:36 PM

Power Crisis: ఓవైపు ఎండలతో జనం పరేషాన్‌ అవుతుంటే.. మరోవైపు కరెంట్‌ కోతలు నరకాన్ని చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం నెలకొంది. బొగ్గుకొరతను నివారించడానికి కేంద్రం కీలక చర్యలు చేపట్టింది.

దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తుంటే.. కరెంట్‌ కోతలు ప్రజలకు ప్రత్యక్ష నరకం కనబడుతోంది. బొగ్గు కొరత కారణంగా 12 రాష్ట్రాల్లో తీవ్ర కరెంట్‌ సంక్షోభం నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండల కారణంగా దేశవ్యాప్తంగా కరెంట్‌ డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, ఉత్తరాఖండ్‌, బీహార్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతలు జనాన్ని పరేషాన్‌ చేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా కరెంట్‌ కోతలను అధిగమించే చర్యల్లో భాగంగా 657 ప్యాసింజర్‌ రైళ్లను నిరవధికంగా రద్దు చేశారు. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గును పవర్‌ ప్లాంట్లకు తరలించే క్రమంలో- బొగ్గుసరఫరా చేస్తున్న 400 రైల్‌ రేక్స్‌ ప్రయాణానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలో 165 థర్మల్‌ పవర్‌ స్టేషన్లు ఉంటే, వాటిలో 56 పవర్‌ స్టేషన్లలో 10 శాతం, అంతకన్నా తక్కువ బొగ్గు నిల్వ ఉందని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ చెబుతోంది. కనీసం 26 థర్మల్‌ స్టేషన్లలో 5 శాతం బొగ్గు నిల్వ ఉందని ఈ సంస్థ చెప్పడంతో డేంజర్‌బెల్స్‌ మోగుతున్నాయి.

పవర్‌ డిమాండ్‌ 38 ఏళ్లలో కనీవినీ ఎరుగని రికార్డుస్థాయికి చేరింది. దేశవ్యాప్తంగా ఎండలు 122 ఏళ్లలో అత్యంత తీవ్రంగా ఉండటమే కారణం. కరెంట్ డిమాండ్‌కు సరిపడా సప్లయ్‌ లేకపోవడమే ఈ విద్యుత్‌ కోతలకు కారణం. మండే ఎండల్లో కరెంటు ఉత్పత్తి చేయడానికి సరిపడా బొగ్గు నిల్వలు మనదేశంలో లేవు. గుజరాత్‌లో పరిశ్రమలు వారానికి ఒకరోజు పవర్ హాలీడే ప్రకటించాయి. మహారాష్ట్రలో ఆరు నుంచి ఎనిమిది గంటలు పవర్‌ కట్‌ చేస్తున్నారు.

కరెంట్ కోతలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. పంజాబ్‌లోని భటిండాలో కాంగ్రెస్‌ పార్టీ భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. కరెంటు, నీళ్లు ఇవ్వాలని కేంద్రాన్ని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అటు జమ్ములో కూడా ఇవే డిమాండ్లతో కాంగ్రెస్‌ శ్రేణులు రోడ్డెక్కాయి. కేంద్రంపై బాణాలు ఎక్కుపెడుతూ మండుటెండలో ప్రదర్శన చేపట్టారు.

కరెంట్‌ సంక్షోభంపై ఢిల్లీలో పాలిటిక్స్‌ ఊపందుకున్నాయి. ఢిల్లీలో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డ‌నుంద‌ని ఆప్‌ ప్రభుత్వం హెచ్చరించింది. ఢిల్లీ మెట్రోతో పాటు హాస్పిట‌ళ్ల‌కు కూడా విద్యుత్తు స‌ర‌ఫ‌రాలో స‌మ‌స్య‌లు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఢిల్లీ ప్ర‌భుత్వం తెలిపింది. దాద్రి-2, ఉంచాహ‌ర్ విద్యుత్తు కేంద్రాల నుంచి విద్యుత్తు స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ఏర్ప‌డుతోంద‌ని, ఢిల్లీ మెట్రోతో పాటు ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్లు, ఇత‌ర కీల‌క కార్యాల‌యాల‌కు 24 గంట‌ల విద్యుత్తును స‌ర‌ఫ‌రా చేయ‌డం సాధ్యం కాదని వెల్లడించింది. అయితే ఢిల్లీ ప్రభుత్వ వాదనలో నిజం లేదని ఎన్టీపీసీ అంటోంది. దాద్రి-2, ఊంచహార్ పవర్ ప్లాంట్స్‌కు క్రమబద్ధంగా నిత్యం బొగ్గు సరఫరా అవుతోందని, ఈ రెండూ పరిపూర్ణ సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది.

Also read:

Breast Cancer in Men: పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్.. ఈ లక్షణాలుంటే వెంటనే అలర్ట్ అవ్వండి..!

Viral Video: వీడ్కోలు సమయంలో బోరున విలపించిన వరుడు.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు..!

Healthy Oats: త్వరగా బరువు తగ్గాలని భావిస్తున్నారా?.. ఓట్స్‌ని ఈ 4 విధాల్లో తీసుకోండి..