AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పురికొసలు దిండులే అవి.. టెస్ట్ చేస్తే మైండ్ బ్లాంకయ్యే బాగోతం.. ఇలా ఎలా సామి

పురికోసలో హెరాయిన్‌! ఇదెలా సాధ్యం? డౌట్‌ రావడం సహజమే. కానీ ఇదే డ్రగ్స్‌ మాఫియా కొత్త తెలివి. వారి ఐడియాకు అధికారులే స్టన్ అయ్యారు. వివరాలు తెలుసుకుందాం పదండి.

Viral:  పురికొసలు దిండులే అవి.. టెస్ట్ చేస్తే మైండ్ బ్లాంకయ్యే బాగోతం.. ఇలా ఎలా సామి
A representative image
Ram Naramaneni
|

Updated on: Apr 29, 2022 | 9:51 PM

Share

Gujarat:గుజరాత్‌లోని పిపావవ్‌(Pipavav)పోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. కొన్ని రోజుల కిందట పిపావవ్‌ పోర్ట్‌కు చాలా కంటైనర్లు వచ్చాయి. వాటిలో ఒకటి మాత్రం స్పెషల్‌. దాని గురించి డీఆర్‌ఐ, గుజరాత్‌ ఏటీఎస్‌కు ఉప్పందింది. ఆ కంటైనర్‌ను తనిఖీ చేశారు అధికారులు. దాని బరువు పది వేల కేజీలకు కాస్త తక్కువ. దాంట్లో వంద పెద్ద సంచులు ఉన్నాయి. ఆ సంచుల్లో పురికోస ఉంది. కానీ నాలుగు సంచుల్లోనే ఉంది కథంతా. వాటిలో ఉన్నది కూడా పురికోసే. అయితే నిండా హెరాయిన్‌ను నింపుకున్న పురికోస అది. ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ చేసిన ఫీల్డ్‌ టెస్ట్‌లో కానీ ఈ విషయం బయటపడలేదు. ఈ నాలుగు సంచులు కలిపి 395 కిలోల బరువు ఉన్నాయి. హెరాయిన్‌ రవాణాకు ఈసారి డ్రగ్స్‌ మాఫియా పూర్తిగా కొత్త పద్ధతి ఫాలో అయింది. హెరాయిన్‌ కలిపిన సొల్యూషన్‌లో పురికోసను ముంచి, ఆరబెట్టినట్టు అధికారులు గుర్తించారు. తర్వాత బేళ్లుగా చేసి, బ్యాగ్స్‌లో ప్యాక్‌ చేశారు. ఈ నాలుగు బ్యాగ్‌లను సాధారణ పురికోస ఉంచిన సంచులతో పాటు షిప్పింగ్‌ చేశారు. ఇలా చేస్తే అధికారుల కంటపడకుండా డ్రగ్స్‌ను చేరవేయవచ్చని మాఫియా ఎత్తుగడ. గమ్యం చేరిన తర్వాత పురికోస నుంచి హెరాయిన్‌ను ఎక్స్‌ట్రాక్ట్‌ చేయాలన్నది వారి ఆలోచన. దానికో ప్రత్యేక పద్ధతి ప్లాన్‌ చేశారు. అయితే అధికారులకు అందిన రహస్య సమాచారంతో మాఫియా గుట్టు రట్టు అయింది. పట్టుబడిన హెరాయిన్‌ విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. వారం రోజుల్లో రూ. 2180కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేశారు.

Also Read:  Viral Video: యమపాశంలా దూసుకువచ్చిన బండ రాయి.. క్షణకాలంలో ఊహించని విషాదం..

ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
మీ కాలేయంలోని కొవ్వును వెన్నలా కరిగించే పానియం ఇది.. తయారీ ఇలా..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
ప్రేమలో ఉన్న ప్రతి కుర్రాడు పాడుకునే ఏకైక సాంగ్..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..