AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మత్తుగా మాట్లాడతారు.. వలపుల వల విసురుతారు.. చిక్కారో విలవిలే

టెక్నాలజీ ఎప్పటికప్పుడు పెరుగుతున్నా అందుకు తగ్గటే సాంకేతిక మోసాలు, సైబర్ నేరాలు(Cyber Crime) పెరిగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. గంటల కొద్దీ సోషల్ మీడియాలోనే(Social Media) గడిపేస్తున్నారు....

Hyderabad: మత్తుగా మాట్లాడతారు.. వలపుల వల విసురుతారు.. చిక్కారో విలవిలే
Cyber
Ganesh Mudavath
|

Updated on: Apr 30, 2022 | 5:11 PM

Share

టెక్నాలజీ ఎప్పటికప్పుడు పెరుగుతున్నా అందుకు తగ్గటే సాంకేతిక మోసాలు, సైబర్ నేరాలు(Cyber Crime) పెరిగిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. గంటల కొద్దీ సోషల్ మీడియాలోనే(Social Media) గడిపేస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తియ్యని మాటలతో కవ్వించి, ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్(Hyderabad) నగరంలో మరో కొత్త తరహా సైబర్ మోసం బయటపడింది. అందమైన సాయంత్రాలు.. అవధులులేని ఆనందం ఆస్వాదించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మాతో మాట్లాడండి.. అంటూ వాట్సాప్‌కు మెసేజ్ చేస్తున్నాయి సైబర్ ముఠాలు. నిజమేనననుకుని మాట్లాడితే బ్యాంక్‌ ఖాతాల్లోంచి రూ.లక్షలు మాయం చేసేస్తున్నాయి. కోల్‌కతా కేంద్రంగా సైబర్‌ నేరస్థులు యువకులపై ప్రయోగించిన సరికొత్త అస్త్రం ఈ మోసం. సెల్ ఫోన్ మెసేజ్ కు వచ్చిన నంబర్లతో మాట్లాడిన కొందరు రూ.లక్షలు నగదు బదిలీ చేసి మోసపోయామని తెలుసుకుని సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

కోల్ కతా కేంద్రంగా జరుగుతున్న ఈ దందాలో.. బాధితులను మోసం చేసేందుకు భారీ నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్నారు. రోజుకు వెయ్యిమందికి సందేశాలు పంపుతున్నారు. స్పందించిన వారితో ఫోన్‌లో మాట్లాడేందుకు అందమైన యువతులను టెలీకాలర్లుగా నియమించుకున్నారు. ఫోన్‌ చేసిన వారితో మత్తుగా మాట్లాడిస్తున్నారు. బయటికి వెళ్దాం.. సరదాగా భోజనం చేద్దాం అంటూ కవ్విస్తారు. అందుకు మనం ఒప్పుకోగానే.. రూ.10వేలు సభ్యత్వం చెల్లించాలని కండిషన్ పెడతారు. డబ్బు కట్టగానే.. వీడియో కాల్‌ చేసి మాట్లాడుతున్నారు. రిసార్ట్‌కు వెళ్దాం.. నాకు డబ్బులు ఇస్తే తెలిసిన ప్రాంతానికి వెళ్దాం అంటూ మోసగిస్తున్నారు. వారికి డబ్బులు చేరుకోగానే మాట్లాడడం ఆపేసి.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేస్తున్నారు. వీరి వలపు వలలో చిక్కుకున్న ఓ యువకుడు యువతి సూచనలకు అనుగుణంగా రూ.1.10లక్షలు నగదు బదిలీ చేశాడు. మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

డేటింగ్‌-మీటింగ్‌ పేరుతో వాట్సాప్‌ నంబర్లకు మెసేజ్ లు పంపిస్తున్న కోల్‌కతా సైబర్‌ నేరస్థులను అరెస్ట్‌ చేస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఈ మెసేజ్ లకు స్పందించవద్దని కోరుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Electricity bill: ఎండాకాలంలో కరెంటు బిల్లు వాసిపోతుందా.. తగ్గడానికి ఈ టిప్స్ పాటించండి!

Char dam: చార్‌ధామ్ యాత్రికులకు ఊరట.. ఇకపై ఆ నిబంధనలు తొలగింపు