AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Char dam: చార్‌ధామ్ యాత్రికులకు ఊరట.. ఇకపై ఆ నిబంధనలు తొలగింపు

హిమాలయ పర్వత శ్రేణుల్లో పవిత్ర ఆధ్యాత్మిక చార్‌ధామ్(Char Dam) ను చేరుకోవడం ఆధ్యాత్మిక సాహసంగా చెప్పవచ్చు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎంతోమంది భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ యాత్ర చేపట్టడాన్ని తమ అదృష్టంగా భావిస్తారు. భారతదేశంలో....

Char dam: చార్‌ధామ్ యాత్రికులకు ఊరట.. ఇకపై ఆ నిబంధనలు తొలగింపు
Char Dam
Ganesh Mudavath
|

Updated on: Apr 30, 2022 | 4:03 PM

Share

హిమాలయ పర్వత శ్రేణుల్లో పవిత్ర ఆధ్యాత్మిక చార్‌ధామ్(Char Dam) ను చేరుకోవడం ఆధ్యాత్మిక సాహసంగా చెప్పవచ్చు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎంతోమంది భక్తులు భక్తిశ్రద్ధలతో ఈ యాత్ర చేపట్టడాన్ని తమ అదృష్టంగా భావిస్తారు. భారతదేశంలో ఎన్ని పుణ్యక్షేత్రాలున్నా.. ‘చార్‌ధామ్’నే ప్రత్యేక ఆధ్యాత్మిక పుణ్యభూమిగా పిలుస్తారు. సమస్త పాపాలను హరించి, మోక్షానికి మార్గం చూపించే ‘చార్‌ధామ్ యాత్ర’లో విశేషాలు అనేకం. హిమాలయ(Himalaya’s) స్థాణువుల్లో అత్యంత శీతల ప్రాంతంలో.. సముద్ర మట్టానికి 10వేలకు పైగా అడుగుల ఎత్తులో ఉన్న యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను సర్వపాపాలను హరించే చార్‌ధామ్‌గా మన ఇతిహాసంలో చెప్పారు. ‘సనాతన ధర్మానికి, హైందవ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా, నాలుగు వేదాల పవిత్రతను మించి స్వర్గప్రాప్తిని కలిగించే పవిత్ర తీర్థాలే చార్‌ధామ్’ అని త్రిమూర్తులే చెప్పారని మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతోంది. తమ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి చార్ ధామ్ యాత్రను చేపట్టాలని ప్రతి ఒక్క హిందువు కోరుకుంటాడు. అయితే హిమాలయాల్లో ఉండే అనుకూల, ప్రతికూల పరిస్థితుల నడుమ ఉత్తరాఖండ్(Uttarakhand) ప్రభుత్వం పరిమితంగానే భక్తులకు అనుమతిస్తోంది.

ఈ ఏడాది మే 3న ప్రారంభం కానున్న చార్‌ధామ్ యాత్రలో పాల్గొనే భక్తులకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఊరటనిచ్చింది. కొవిడ్ పరీక్ష, వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ అవసరం లేదని చెప్పింది. అయితే, యాత్రకు ముందు భక్తులందరూ విధిగా రాష్ట్ర పర్యాటక పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. యాత్ర తేదీ సమీపిస్తుండటం, ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులకు కొవిడ్ నిబంధనల విషయంలో గందరగోళం నెలకొనడంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సూచనల మేరకు ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ సంధు అధికారులతో సమావేశమయ్యారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆ రాష్ట్ర సీఎస్ సంధు ఆదేశించారు. ఇప్పటివరకు దాదాపు 1.5 లక్షల మంది ఈ యాత్ర కోసం రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో.. భక్తులకు నెగెటివ్‌ ఆర్టీపీసీఆర్‌ రిపోర్టు తప్పనిసరి అని తొలుత వార్తలు వెలువడ్డాయి. గతంలో భక్తుల సంఖ్యపై పరిమితులూ విధించారు.

మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు భారీ షాక్.. రూ. ఏడు కోట్ల ఆస్తులు ఈడీ జప్తు!

Telangana: “తెలంగాణలో ఫ్రెండ్స్ ఉంటే వాస్తవ పరిస్థితులు తెలిసేవి”.. కేటీఆర్ కామెంట్స్ పై షర్మిల ఫైర్