Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. మే 5న శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను అనుమతి
Tirumala: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. శీవారి భక్తుల సౌకర్యార్ధం.. టీటీడీ(TTD) పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వేసవి సందర్భంగా భక్తుల రద్దీ..
Tirumala: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. శీవారి భక్తుల సౌకర్యార్ధం.. శ్రీవారి మెట్టు మార్గం నుంచి భక్తులకు అనుమతిని ఇవ్వనున్నారు. మే 5న శ్రీనివాస సేతును సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు టీటీడీ(TTD) పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వేసవి సందర్భంగా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సర్వదర్శనాలు (Sarvadarshanam), స్లాట్ దర్శనాలను(Slot darshan) కొనసాగించనున్నారు. మరోవైపుశ్రీనివాస సేతు రెండో దశ పనులకు 100 కోట్ల రూపాయలను కేటాయించారు. ఎలక్ట్రిక్ బస్ స్టేషన్ ఏర్పాటుకు 2.86 ఎకరాలను కేటాయించాలని TTD నిర్ణయించింది. వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తికి ప్లాంట్ ఏర్పాటు చేయాలని TTD పాలక మండలి నిర్ణయించింది.
240 కోట్ల రూపాయలతో పిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. అంతేకాదు 3 కోట్ల 61 లక్షల రూపాయలతో శ్రీవారికి రెండు బంగారు సింహాసనాలు తయారు చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఇప్పటి వరకు నగదు రూపంలో టీటీడీకి విరాళం ఇచ్చిన వారికే ప్రివిలేజ్ దర్శనాలు కల్పించారు. ఇకపై ఇతర మార్గాల్లో విరాళం అందించిన భక్తులకు కూడా ప్రివిలేజ్ దర్శనం కల్పించాలని నిర్ణయించారు. మరోవైపు డిసెంబర్‌లోపు జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇటు ముంబైలో నిర్మించే శ్రీవారి ఆలయం కోసం మహారాష్ట్ర సర్కార్ 500 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని కేటాయించిందని TTD పాలకమండలి తెలిపింది. గత 20 ఏళ్లుగా అద్దె భవనంలో శ్రీవారి విగ్రహాన్ని పెట్టి దర్శనాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ముంబైలో స్వామి వారికి సొంత ఆలయం నిర్మాణం జరగనుంది. ముంబైలో శ్రీవారి ఆలయ భూమికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్‌ను టీటీడీ చైర్మన్‌కు అందించారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు మంత్రి ఆదిత్య ఠాక్రే. ఈ సందర్భంగా మహరాష్ట్రలోని వేదిక్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో కళాశాల ఏర్పాటు చేయ్యాలని కోరారు ఆదిత్య ఠాక్రే. అందుకు టీటీడీ సానుకూలంగా స్పందించింది. ముంబైలో నిర్మించే శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం 60 కోట్ల రూపాయల విరాళం ఇచ్చేందుకు రేమండ్ సంస్థ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారు.
Also Read: Border Drone: పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి మేడిన్ చైనా డ్రోన్.. కాల్చేసిన భద్రతా దళాలు
Tamil Nadu: రోడ్డును బ్లాక్ చేసిన ఏనుగు.. అంబులెన్స్‌లో ప్రసవించిన మహిళ.. తల్లి, బిడ్డ క్షేమం