AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Border Drone: పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి మేడిన్ చైనా డ్రోన్‌.. కాల్చేసిన భద్రతా దళాలు

పంజాబ్‌లోని అమృత్‌సర్ సెక్టార్‌లో పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్‌ను కూల్చివేసినట్లు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) వెల్లడించింది.

Border Drone: పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి మేడిన్ చైనా డ్రోన్‌.. కాల్చేసిన భద్రతా దళాలు
Made In China Drone
Balaraju Goud
|

Updated on: Apr 30, 2022 | 3:08 PM

Share

‘Made in China’ drone to India: పంజాబ్‌(Punjab)లోని అమృత్‌సర్(Amritsar) సెక్టార్‌లో పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్‌ను కూల్చివేసినట్లు సరిహద్దు భద్రతా దళం (BSF) వెల్లడించింది. బీఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్‌సర్ సెక్టార్‌లోని ధనో కలాన్ గ్రామ సమీపంలోని ప్రాంతంలో తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో మేడిన్ చైనా డ్రోన్ భారత భూభాగంలోకి ప్రవేశించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మోహరించిన BSF సిబ్బంది ఎగిరే వస్తువు శబ్దం విని, ప్రామాణిక ఆపరేటింగ్ విధానం ప్రకారం దానిని కాల్చివేశారు. ఆ ప్రాంతమంతా చుట్టుముట్టి పోలీసులు, ఇతర భద్రతా సంస్థలకు వెంటనే సమాచారం అందించారు.

ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించినట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. ఉదయం 6.15 గంటల ప్రాంతంలో ధనో కలాన్ గ్రామం సమీపంలో సెర్చ్ టీమ్ బ్లాక్ కలర్ ‘మేడ్ ఇన్ చైనా’ క్వాడ్‌కాప్టర్ (డ్రోన్), మోడల్ DJI మ్యాట్రిస్-300ని స్వాధీనం చేసుకుంది. దానిని కాల్చివేసినప్పుడు, క్వాడ్‌కాప్టర్‌లో పేలోడ్ లేదు. డ్రోన్‌లో పేలోడ్ ఉందా లేదా అని నిర్ధారించడానికి మొత్తం ప్రాంతాన్ని తిరిగి శోధించినట్లు BSF అధికారులు తెలిపారు

భారత్‌కు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి పాకిస్తాన్‌లోని భారత వ్యతిరేక శక్తులు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాయి. పంజాబ్ సరిహద్దులో హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను రవాణా చేయడానికి డ్రోన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు డ్రోన్‌ను కూల్చివేసిన తర్వాత ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని సీనియర్ BSF అధికారులు తెలిపారు.

Read Also….  Mana Uru Mana Badi: జూన్ 1 నుంచి బడి బాట.. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా సర్కార్ బడులుః మంత్రి సబితా

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..