Tamil Nadu: రోడ్డును బ్లాక్ చేసిన ఏనుగు.. అంబులెన్స్‌లో ప్రసవించిన మహిళ.. తల్లి, బిడ్డ క్షేమం

Tamil Nadu: ఒక్కోసారి మనం నమ్మలేని సంఘటనలు మన కళ్లముందే జరుగుతాయి. అలాంటిదే ఈ సంఘటన కూడా. సాధారణంగా వన్యప్రాణులు గిరిజనులతో స్నేహపూర్వకంగా మెలుగుతాయి..

Tamil Nadu: రోడ్డును బ్లాక్ చేసిన ఏనుగు.. అంబులెన్స్‌లో ప్రసవించిన మహిళ.. తల్లి, బిడ్డ క్షేమం
Elephant Blocked Road
Follow us
Surya Kala

|

Updated on: Apr 30, 2022 | 3:56 PM

Tamil Nadu: ఒక్కోసారి మనం నమ్మలేని సంఘటనలు మన కళ్లముందే జరుగుతాయి. అలాంటిదే ఈ సంఘటన కూడా. సాధారణంగా వన్యప్రాణులు గిరిజనులతో స్నేహపూర్వకంగా మెలుగుతాయి. ఇదిలా ఉంటే, తమిళనాడులో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ ఏనుగు కారణంగా ఓ గిరిజన మహిళకు సుఖ ప్రసవం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో అడవి ఏనుగు ఘాట్ రోడ్డును అడ్డుకోవడంతో 24 ఏళ్ల గిరిజన మహిళ అంబులెన్స్‌లో శిశువుకు జన్మనిచ్చింది. ఆరోగ్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మహిళకు ప్రసవ నొప్పి రావడంతో బంధువులుగర్భిణీని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. అంబులెన్స్ ఘాట్ రోడ్డుమీదకు వచ్చినప్పుడు ఇంతలో హఠాత్తుగా ఓ ఏనుగు రోడ్డుమీదకు వచ్చింది. రోడ్డుకి అడ్డంగా నిలబడి.. రోడ్డుని బ్లాక్ చేసింది.  దీంతో రోడ్డుమీద వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అంబులెన్స్ డ్రైవర్ వాహనాన్ని ఆపి అరగంటకు పైగా వేచి చూసినా ఏనుగు కదలలేదు.

ఇంతలో, మహిళకు నొప్పి అధికం కావడంతో అంబులెన్స్‌లోని బృందం మహిళ ప్రసవానికి సహాయం చేసింది. గర్భిణీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొన్ని నిమిషాల అనంతరం ఏనుగు రోడ్డుమీద నుంచి వెళ్లిపోయింది. వెంటనే అంబులెన్స్ లోని స్త్రీని, పుట్టిన బిడ్డను ఆరోగ్య అధికారులు గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది చెప్పారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వైరల్ వార్తలకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి..

Also Read: Real Estate: బూమ్ లో దేశీయ రియల్టీ సెక్టార్.. కొత్త ఇళ్లకు భారీగా డిమాండ్.. ఎందుకంటే..

Health Tips: గర్భధారణ సమయంలో పీనట్‌బటర్‌ తినడం మేలేనా? నిపుణులు ఏమంటున్నారంటే..