Real Estate: బూమ్ లో దేశీయ రియల్టీ సెక్టార్.. కొత్త ఇళ్లకు భారీగా డిమాండ్.. ఎందుకంటే..
Real Estate: దేశంలోని హౌసింగ్ మార్కెట్ భారీ బూమ్‌ను చూస్తోంది. గత మార్చి త్రైమాసికంలో 70 వేలకు పైగా ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇది డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాల కంటే 13 శాతం ఎక్కువగా నమోదైంది.. ఎందుకంటే..
Real Estate: దేశంలోని హౌసింగ్ మార్కెట్(Housing Market) భారీ బూమ్‌ను చూస్తోంది. గత మార్చి త్రైమాసికంలో 70 వేలకు పైగా ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇది డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాల కంటే 13 శాతం ఎక్కువ. అదే గత ఏడాది మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఏకంగా 40 శాతం ఎక్కువగా అమ్మకాలు ఉన్నాయి. లగ్జరీ హౌసింగ్(Luxury houses) విభాగంలో అత్యుత్తమ వృద్ధి కనిపించింది. అమ్మకాలు నాలుగేళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయి. సంవత్సరం మొదటి త్రైమాసికంలో అఫోర్డబుల్ హౌసింగ్ అమ్మకాలు గత త్రైమాసికంతో పోలిస్తే 27 శాతం మేర పెరిగాయని అమెరికన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ CBRE గ్రూప్ నివేదిక వెల్లడించింది. కానీ.. గత త్రైమాసికంలో, డిసెంబర్ త్రైమాసికంలో 16% వృద్ధితో పోలిస్తే, హై-ఎండ్ ఇళ్ల అమ్మకాలు 23 శాతం పెరిగాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మార్చి త్రైమాసికంలో మధ్యతరహా (రూ. 40-80 లక్షల విలువైన) ఇళ్ల అమ్మకాల్లో 41 శాతం అమ్మకాలు క్షీణించాయి.
వచ్చే త్రైమాసికాల్లో అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల లాంచ్‌లు పెరగనున్నాయి. మార్చి త్రైమాసికంలో బలమైన వృద్ధిని కనబరిచిన హౌసింగ్ మార్కెట్, మిగిలిన సంవత్సరంలో వృద్ధిలో ఇదే జోష్ చూపనుంది. 2022లో రెసిడెన్షియల్ రంగం ఏడాది మెుత్తం వృద్ధిని చూపుతుందని CBRE CMD అన్షుమాన్ మ్యాగజైన్ తెలిపింది. రానున్న త్రైమాసికాల్లో కొత్త లాంచ్‌లు పెరగడమే కాకుండా అమ్మకాలు కూడా పెరగనున్నాయి. ఆర్థిక వ్యవస్థ తిరిగి ట్రాక్‌లో ఉన్నప్పుడు హౌసింగ్ సెక్టార్ కి ప్రభుత్వ సపోర్ట్ కొనసాగడం దీనికి కారణంగా తెలుస్తోంది.
విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టనున్నాయని సోథెబీస్ ఇంటర్నేషనల్ రియాల్టీ, CRE మ్యాట్రిక్స్ సంయుక్త నివేదికలో తెలిపింది. ఈ ఏడాది భారతదేశంలో విలాసవంతమైన గృహాల విక్రయాలు ఆల్-టైమ్ రికార్డులను బద్దలు కొట్టనున్నాయని పేర్కొంది. 2021లో ముంబయిలో రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న అపార్ట్‌మెంట్‌లు, పూణేలో రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న అపార్ట్‌మెంట్ల అమ్మకాలు గత నాలుగేళ్లలో అత్యధికంగా అమ్మకాలు జరిగాయి. పూణేలో 27 శాతం, దిల్లీ 21 శాతం, ముంబయిలో 20 శాతం, బెంగళూరు 14 శాతం అమ్మకాలు వాటాను నమోదు చేశాయి. ముంబైలో గతేడాది రూ.20,255 కోట్ల విలువైన 1,214 విలాసవంతమైన ఇళ్లను విక్రయించినట్లు CRE మ్యాట్రిక్స్ డేటా చెబుతోంది. 2018లో దేశ ఆర్థిక రాజధానిలో రూ.9,872 కోట్ల విలువైన 598 విలాసవంతమైన ఇళ్లు అమ్ముడయ్యాయి. అదేవిధంగా గతేడాది పూణెలో రూ.1,407 విలువైన 208 విలాసవంతమైన ఇళ్ల విక్రయాలు జరిగాయి. నాలుగేళ్ల క్రితం ఈ నగరంలో రూ.832 కోట్ల విలువైన 127 విలాసవంతమైన ఇళ్లను అమ్మారు.
ఇవీ చదవండి..
Amazon Loss: జెఫ్ బెజోస్ కు భారీ షాక్.. ఒక్కరోజే లక్షన్నర కోట్ల సంపద ఆవిరి.. ఎందుకంటే..