AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Loss: జెఫ్ బెజోస్ కు భారీ షాక్.. ఒక్కరోజే లక్షన్నర కోట్ల సంపద ఆవిరి.. ఎందుకంటే..

Jeff Bezos: యూఎస్ స్టాక్ మార్కెట్లో అమెజాన్ కంపెనీ షేరు శుక్రవారం కుప్పకూలింది. కేవలం ఒక్క రోజే షేర్ విలువ 14 శాతానికి పైగా పడిపోయింది. ఎందుకంటే..

Amazon Loss: జెఫ్ బెజోస్ కు భారీ షాక్.. ఒక్కరోజే లక్షన్నర కోట్ల సంపద ఆవిరి.. ఎందుకంటే..
Amazon Loss
Ayyappa Mamidi
|

Updated on: Apr 30, 2022 | 1:34 PM

Share

Jeff Bezos: యూఎస్ స్టాక్ మార్కెట్లో అమెజాన్ కంపెనీ షేరు శుక్రవారం కుప్పకూలింది. కేవలం ఒక్క రోజే షేర్ విలువ 14 శాతానికి పైగా పడిపోయింది. ఈ దెబ్బతో కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి 206 బిలియన్ డాలర్ల(రూ.15,76,379 కోట్ల) మేర సంపద ఆవిరైపోయింది. కంపెనీ ప్రకటించిన ఆర్థిక ఫలితాలు.. మార్కెట్లను నిరాశపరచటంతో షేర్ భారీ పతనాన్ని చవిచూసింది. స్టాక్ క్రాష్ కావడంతో అమెజాన్ ఫౌండర్, బిలీనియర్ జెఫ్ బెజోస్ రూ.1.56 లక్షల కోట్ల సంపను కోల్పోయారు. బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ ప్రకారం.. 210 బిలియన్ డాలర్లుగా ఉన్న బెజోస్ సంపద.. ప్రస్తుతం 148.4 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఎలాన్ మస్క్ తర్వాత ప్రపంచంలో రెండవ కుబేరుడిగా ఉన్న బెజోస్ ప్రస్తుతం స్టాక్ క్రాష్‌తో మూడవ స్థానానికి చేరుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు బెజోస్ 44 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయారు.

అమెజాన్ కంపెనీ షేర్లు 14.05 శాతం మేర పతనం కావటంతో.. దాని షేరు ధర 2,485.63 డాలర్లకు చేరుకుంది. 2001 నుంచి అత్యంత తక్కువ స్థాయిలో కంపెనీ అమ్మకాలు నమోదు కావటంతో కంపెనీ షేరు భారీ దెబ్బను చవిచూసింది. మార్కెట్ ఇచ్చిన షాక్ తో ప్రపంచంలోని టాప్- 500 ధనవంతులు మొత్తంగా 54 బిలియన్ డాలర్లకు పైగా సంపదను కోల్పోయారు. బెంచ్‌మార్క్ S&P- 500 ఇండెక్స్ 3.6 శాతం తగ్గింది. అలాగే టెక్ హెవీ Nasdaq- 100 ఇండెక్స్ 4.5 శాతం మేర పడిపోయింది.

అమెజాన్ తన జనవరి – మార్చి క్వార్టర్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో కంపెనీ 3.8 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని పోస్ట్ చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీకి 8.1 బిలియన్ డాలర్ల లాభాలు వచ్చాయి. కరోనా తర్వాత అమ్మకాలు తగ్గడం.. ఎలక్ట్రిక్ వెహికిల్ స్టార్టప్‌లోని తన పెట్టుబడుల్లో భారీ రైట్-డౌన్ కారణంతో తొలిసారిగా అమెజాన్ త్రైమాసికపు నష్టాలను నమోదు చేసింది. దీనికి తోడు ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీపై పెరిగిన ఖర్చుల భారం కూడా నష్టాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Indian Elon Musk: భారత ఎలాన్ మస్క్ ఎవరో మీరు ఊహించగలరా?

Srilanka Crisis: శ్రీలంక ప్రజలకు మరో షాక్.. ఆ మందుల రేట్లు భారీగా పెంచిన ప్రభుత్వం..

Follow Us
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ