ED on Xiaomi: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీకి ఈడీ భారీ షాక్.. రూ.5,551 కోట్ల జియోమీ ఆస్తుల సీజ్
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీకి ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ రికవరీ గట్టి షాక్ ఇచ్చింది.
ED Action on Xiaomi: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీకి ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ రికవరీ గట్టి షాక్ ఇచ్చింది. జియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 5 వేల 551 కోట్ల 27 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ యాక్ట్ 1999 (ఫెమా యాక్ట్) ప్రకారం ED ఈ చర్య తీసుకుంది. జియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. చైనాకు చెందిన షియోమీకి అనుబంధ సంస్థగా భారత్‌లో కొనసాగుతోంది.
స్మార్ట్‌ఫోన్ రంగంలో జియోమీ మేటి కంపెనీ. అయితే విదేశీ మారకంలో ఆ కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. కంపెనీ 2022 ఫిబ్రవరిలో విదేశాలకు పెద్ద మొత్తంలో నిధులను పంపింది. ఈ మేరకు ఈడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈడీ ఓ ప్రకటన విడుదల చేసింది. జియోమీ ఇండియా కంపెనీ.. చైనాకు చెందిన జియోమీ కంపెనీకి అనుబంధంగా నడుస్తోంది. రూ.5000 కోట్లను ఆ కంపెనీ బ్యాంక్ అకౌంట్ల నుంచి సీజ్ చేశారు. ఫెమా చట్టం కింద ఆ డబ్బును సీజ్ చేసినట్లు ఈడీ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జియోమీ కంపెనీ అక్రమ రీతిలో డబ్బులు చెల్లించినట్లు ఈడీ తన విచారణలో తేల్చింది. జియోమీ కంపెనీ ఇండియాలో 2014 నుంచి ఆపరేషన్స్ చేపట్టింది. ఇప్పటి వరకు ఆ కంపెనీ సుమారు 5,551 కోట్లను మూడు విదేశీ కంపెనీలకు మళ్లించినట్లు గుర్తించారు.
ED has seized Rs.5551.27 Crore of M/s Xiaomi Technology India Private Limited lying in the bank accounts under the provisions of Foreign Exchange Management Act, 1999 in connection with the illegal outward remittances made by the company.
— ED (@dir_ed) April 30, 2022
జియోమీ, ఒప్పో వంటి రెండు ప్రధాన స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ గ్రూప్ కంపెనీలకు రాయల్టీ రూపంలో విదేశాలకు డబ్బు పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రెండు కంపెనీలు, వాటి అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. వాటిలో షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రై. లిమిటెడ్‌పై చర్యలు తీసుకున్నారు. జియోమీ టెక్నాలజీ ఇండియా ప్రై. లిమిటెడ్ ద్వారా 2014లో భారతదేశంలో వ్యాపారం ప్రారంభించారు. 2015 నుండి, కంపెనీ చైనా మాతృ సంస్థ జియోమీకి బిలియన్ల రూపాయల రాయల్టీలను పంపుతోంది. ఇది ఫెమా చట్టాన్ని ఉల్లంఘించినట్లు విచారణలో తేలింది.
Read Also…. General Manoj Pande: తొలిసారిగా ఇంజనీర్ చేతికి ఆర్మీ బాధ్యతలు.. 29వ ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే