Solar Eclipse 2022: సూర్యగ్రహణ ప్రభావం తొలగించుకోవడానికి.. చేయాల్సిన దానాలు, పూజలు ఏమిటంటే..

Solar Eclipse 2022: హిందూమతంలో (Hindu mythology).. గ్రహణాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ సమయం దేవుళ్ళకు బాధను కలిగిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. ఇక ఈ గ్రహణం..

Solar Eclipse 2022: సూర్యగ్రహణ ప్రభావం తొలగించుకోవడానికి.. చేయాల్సిన దానాలు, పూజలు ఏమిటంటే..
Solar Eclipse 2022
Follow us
Surya Kala

|

Updated on: Apr 30, 2022 | 5:47 PM

Solar Eclipse 2022: హిందూమతంలో (Hindu mythology).. గ్రహణాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ సమయం దేవుళ్ళకు బాధను కలిగిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. ఇక ఈ గ్రహణం శనిశ్వరుడికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు శనివారం ఏర్పడితే.. పరిస్థితులు మరింత తీవ్రంగా మారతాయని భావిస్తున్నారు. నేటి సూర్యగ్రహణం శని అమావాస్య 2022 నాడు ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణంతో పాటు శని దేవుడి ప్రభావం కూడా ప్రజలపై ఉంటుంది. ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 30 ఏప్రిల్ 2022 అర్ధరాత్రి 12:15 నిమిషాల నుండి ప్రారంభమై మే 1 ఉదయం 4:8 వరకు కొనసాగుతుందని శాస్త్రజ్ఞులు తెలిపారు. శనైశ్చరమావాస్య నాడు శని దేవుడిని అనుగ్రహం పొందాలంటే.. కొన్ని పూజలతో పాటు.. కొన్ని దానాలు చేయమని సూచిస్తున్నారు. ఈ రోజున శని దేవుడిని ఆరాధించడం ద్వారా కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది.  అలాంటి కొన్ని పూజలు, దానం గురించి తెలుసుకుందాం..

ఆవనూనె దీపం:  శనీశ్వరుడి, సూర్య భగవానుని ఆరాధనలో ఆవనూనెకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మీరు ఈ రెండు దేవతలను ప్రసన్నం చేసుకోవాలనుకుంటే, ఈ ప్రత్యేకమైన రోజున ఆవనూనె దీపాన్ని వెలిగించండి. ఆలయానికి వెళ్లి శని దేవుడి ముందు ఆవనూనె దీపం ఉంచండి.  జీవితంలో శాంతి, ఆనందాన్ని కోరుకుంటున్నాను. శనీశ్వరుడికి నలుపు రంగు చాలా ఇష్టమైనది.. కనుక నల్లని వస్త్రాన్ని సమర్పించండి.

ఆంజనేయ స్వామి ఆరాధన: శనీశ్వరుడి ప్రభావాన్ని నివారణ కోసం హనుమంతుడిని ఆశ్రయించడం శ్రేయస్కరమని చెబుతారు. హనుమంతుడిని ఆరాధించేవారిపై శనీశ్వరుడి ప్రభావం ఉందని ఓ వరం ఉంది. ఈ కారణంగా శనివారం శని దేవుడితో పాటు హనుమంతుడిని పూజించాలని పురాణాలు పేర్కొన్నాయి. ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడిని  సూర్య భగవానుడి కుమారుడిగా పరిగణిస్తారు.  కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సూర్యగ్రహణం ప్రభావం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

దానం చేయాల్సిన పద్ధతులు:  హిందూ ధర్మంలో దాన ధర్మానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అలాగే మోక్షాన్ని పొందడంలో సహాయపడుతుంది. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, శని అమావాస్య నాడు నల్లని వస్తువులను దానం చేయండి. నల్ల మినప పప్పు, నల్లని దుస్తులు, నల్ల నువ్వులు దానం చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయని నమ్మకం. గ్రహణం రోజు పేదలకు ఏదైనా దానం చేయడం ద్వారా సూర్య భగవానుడి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు,నమ్మకం పై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Coins Scooty: బైక్ కొనడం కోసం 15 ఏళ్లుగా నాణేల సేకరణ.. కలను నెరవేర్చుకున్న యువకుడు.. లెక్కించ లేక షోరూమ్ వాళ్ళు నానా తంటాలు

కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
రూ. 4 వేల పెన్షన్‌కు ముహుర్తం ఖరారు? తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..
రూ. 4 వేల పెన్షన్‌కు ముహుర్తం ఖరారు? తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..
చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్.. 3 ఏళ్ల రికార్డు బద్దలు
చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్.. 3 ఏళ్ల రికార్డు బద్దలు
హైదరాబాద్‌లో మరో దారుణం.. బిర్యానీలో బొద్దింక, ఎక్కడంటే..
హైదరాబాద్‌లో మరో దారుణం.. బిర్యానీలో బొద్దింక, ఎక్కడంటే..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!