Coins Scooty: బైక్ కొనడం కోసం 15 ఏళ్లుగా నాణేల సేకరణ.. కలను నెరవేర్చుకున్న యువకుడు.. లెక్కించ లేక షోరూమ్ వాళ్ళు నానా తంటాలు

Coins Scooty: ఎన్ని కార్లున్నా బైక్ మీద ప్రయాణం అంటే యువతకు మంచి క్రేజ్.. స్టార్ హీరోలైన, క్రికెటర్లు అయినా తమ స్థాయికి తగ్గట్లు బైక్స్ కొంటారు.. వాటిమీద చక్కర్లు కొట్టడానికి ఆసక్తిని చూపిస్తారు..

Coins Scooty: బైక్ కొనడం కోసం 15 ఏళ్లుగా నాణేల సేకరణ.. కలను నెరవేర్చుకున్న యువకుడు.. లెక్కించ లేక షోరూమ్ వాళ్ళు నానా తంటాలు
Odisha Young Man
Follow us
Surya Kala

|

Updated on: Apr 30, 2022 | 5:27 PM

Coins Scooty: ఎన్ని కార్లున్నా బైక్ మీద ప్రయాణం అంటే యువతకు మంచి క్రేజ్.. స్టార్ హీరోలైన, క్రికెటర్లు అయినా తమ స్థాయికి తగ్గట్లు బైక్స్ కొంటారు.. వాటిమీద చక్కర్లు కొట్టడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే బైక్ అంటే అందరి యువకులకు ఇష్టమైనా.. కొంతమంది సొంతం..  ద్విచక్రవాహనం కొనుగోలుచేయాలనేది.. ఒక కల.. ఆ కలను తీర్చుకోవడానికి చాలామంది ఎంతో కష్టపడతారు. రూపాయికి రూపాయి జత చేస్తూ.. తమ సొంత బైక్ కలను నెరవేర్చుకుంటారు. తాజాగా ఓ యువకుడు చిన్నతనం నుంచి బండి కొనుకోవాలంటూ కల కన్నాడు. అప్పటినుంచి తన కలను నెరవేర్చుకోవడం కోసం కృషి చేస్తూ 15 ఏళ్ల తర్వాత ఆ యువకుడి ఇప్పుడు తాను అనుకున్నది సాధించాడు. సొంతంగా స్కూటీని(Scooty) కొనుగోలు చేశాడు. ఈ ఘటన ఒడిశాలో(Odisha) చోటు  చేసుకుంది. వివరాలలోకి వెళ్తే..

ఒడిశా మయూర్‌భంజ్‌ జిల్లా బారిపదాకు చెందిన వికాస్‌ అనే యువకుడు 15 ఏళ్ల క్రితం సొంతంగా బైక్ కొనాలనుకున్నాడు. అందుకు అప్పటి నుంచి రూపాయి, రెండు రూపాయల క్యాయిన్స్ ను పోగుచేయడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి తనకు ఎంత వీలయితే అంత చిల్లర పోగుచేస్తూ ఉన్నాడు. చివరకు తన దగ్గర డబ్బులుంటే.. వాటిని చిల్లరగా మార్చి జత చేశాడు. ఇప్పుడు అనుకున్నది సాధించాడు.

వికాస్ ఇటీవల తాను పోగు చేసిన రూపాయల కాయిన్స్ ను లెక్కించాడు. మొత్తం రూ. 62 వేలు పోగుచేశాడు. ఈ మొత్తం రూపాయిలను సమీపంలోని హీరో షోరూంలోకి వెళ్లి ఇచ్చాడు. తనకు నచ్చిన స్కూటీని కొనుగోలు చేశాడు. అయితే ఈ చిల్లర నాణేలను లెక్కించడానికి షో రూమ్ సిబ్బంది నానా తంటాలు పడ్డారు. డబ్బు ఏ రూపంలో ఉన్నా డబ్బే కదా అంటూ స్కూటర్ కు వికాస్ కు అప్పగించారు. ఎలాగైతేనేమి.. తన ఆసక్తిని ఇష్టాన్ని 15 ఏళ్ల తర్వాత నెరవేర్చుకున్న వికాస్ ఇప్పుడు కొత్త స్కూటీమీద చక్కర్లు కొడుతున్నాడు.

 Also Read: Electricity bill: ఎండాకాలంలో కరెంటు బిల్లు వాసిపోతుందా.. తగ్గడానికి ఈ టిప్స్ పాటించండి!

Pawan Kalyan: పవన్ తేజుల మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధం.. తుది దశలో ప్రీ ప్రొడక్షన్ పనులు.. సెట్స్​పైకి వెళ్ళేది ఎప్పుడంటే..