Viral Video: పెళ్లి బరాత్ లో నాగిని డ్యాన్స్.. రియల్ స్నేక్ తో చిందులు.. చివరకు

పెళ్లి బరాత్ అంటే చెవులు చిల్లులు పడేలా డీజేలు, పూనకం వచ్చినట్లు ఊగిపోయే స్టెప్పులు. బరాత్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాగిని డ్యాన్స్ గురించే. డీజేలో నాగిని మ్యూజిక్ రాగానే.. ఒళ్లు మర్చిపోయి, నేలపై పొర్లి మరీ చిందులేస్తారు. ఇదంతా...

Viral Video: పెళ్లి బరాత్ లో నాగిని డ్యాన్స్.. రియల్ స్నేక్ తో చిందులు.. చివరకు
Viral Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 30, 2022 | 4:40 PM

పెళ్లి బరాత్ అంటే చెవులు చిల్లులు పడేలా డీజేలు, పూనకం వచ్చినట్లు ఊగిపోయే స్టెప్పులు. బరాత్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాగిని డ్యాన్స్ గురించే. డీజేలో నాగిని మ్యూజిక్ రాగానే.. ఒళ్లు మర్చిపోయి, నేలపై పొర్లి మరీ చిందులేస్తారు. ఇదంతా మామూలుగా జరిగేదే. అయితే ఓ పెళ్లిలో మాత్రం నాగిని డ్యాన్స్ వినూత్నంగా జరిగింది. మనుషులే నాగినిలా డ్యాన్స్ చేస్తే ప్రత్యేకత ఏముంది అనుకున్నారేమో.. ఏకంగా నాగుపామునే బరాత్ కు తీసుకొచ్చారు. దానితో కలిసి స్టెప్పులేశారు. చివరికి కటకటాలపాలయ్యారు. ఒడిషాలోని మయూర్‌భంజ్‌లో ఈ ఘటన జరిగింది. ఓ వివాహ వేడుక కోసం నాగుపామును తీసుకొచ్చి, నాగిని డ్యాన్స్‌ పేరిట ఆడించారు. పాములు పట్టే వ్యక్తి దానిని ఆడిస్తుంటే వందల మంది చుట్టూ చేరి ఆ రియల్‌ నాగిని డ్యాన్స్‌ను చూస్తూ ఉండిపోయారు. బుట్టలో పాము.. చెవులు పగిలిపోయే మ్యూజిక్‌, నృత్యాల కోలాహలంతో బారాత్‌లో ఆ నాగిని డ్యాన్స్‌ వీడియో విపరీతంగా వైరల్‌ అయ్యింది. ఈ విషయం అధికారులకు తెలిసింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. పామును ఫారెస్ట్‌ అధికారులకు అప్పగించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీచదవండి

Viral Video: బాలుడు సైకిల్ మీద స్టంట్స్‌.. హఠాత్తుగా ముందు చక్రం ఊడడంతో ఊహించని పరిణామం..

Heat Wave: అత్యవసరమైతేనే బయటకు రండి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!