Viral Video: బాలుడు సైకిల్ మీద స్టంట్స్.. హఠాత్తుగా ముందు చక్రం ఊడడంతో ఊహించని పరిణామం..
Viral Video: ఈరోజుల్లో పిల్లల నుంచి యువత వరకు స్టంట్స్‌పై మోజు ఎక్కువగా కనిపిస్తోంది. డిఫరెంట్ స్టైల్ లో స్టంట్స్ చేస్తూ.. యువతకు మేము ఏ మాత్రం తీసిపోమంటూ కొంతమంది పిల్లలు కూడా వెనక్కి..
Viral Video: ఈరోజుల్లో పిల్లల నుంచి యువత వరకు స్టంట్స్‌పై మోజు ఎక్కువగా కనిపిస్తోంది. డిఫరెంట్ స్టైల్ లో స్టంట్స్ చేస్తూ.. యువతకు మేము ఏ మాత్రం తీసిపోమంటూ కొంతమంది పిల్లలు కూడా వెనక్కి తగ్గడం లేదు. చిన్న వయసులో కూడా, ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇలాంటి విన్యాసాలు చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ బారిన పడుతున్నా ఏమాత్రం తగ్గడం లేదు. బైక్ విన్యాసాలు, సైకిళ్లతో రకరకాల విన్యాసాలు చేసే పిల్లల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో(Social media) హల్ చల్ చేస్తున్నాయి. ఈ వైరల్ వీడియోల్లో పిల్లలు సైకిళ్లపై రకరకాల విన్యాసాలు చేస్తున్నట్లు చూస్తూనే ఉన్నాం. ఈ విన్యాసాలు చూపరులను ఆశ్చర్యపరాస్తారు. అయితే కొన్నిసార్లు ఈ విన్యాసాలు విఫలమవుతాయి. అలాంటి ఒక స్టంట్ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో ఒక పిల్లవాడు స్టంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు.. అది సరిగ్గా వర్కౌట్ కాలేదు.
వాస్తవానికి, పిల్లవాడు సైకిల్‌తో విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ బాలుడు సైకిల్ ముందు చక్రం హఠాత్తుగా సైకిల్ నుంచి విడిపోయి బయటకు వచ్చింది. సైకిల్ నడుపుతున్నప్పుడు పిల్లవాడు అకస్మాత్తుగా సైకిల్ ను ఎత్తి వెనుక చక్రంతో నడపడానికి ప్రయత్నించాడు. అయితే అలాంటి విన్యాసం చేస్తున్న సమయంలో సైకిల్ నుంచి ముందు చక్రం విడిపోయి.. ముందువెల్లిపొయింది. చాలా దూరంగా వెళ్ళిపోయిన ముందుచక్రాన్ని అందుకోవడానికి పిల్లవాడు వేగంగా సైకిల్ తొక్కుతూ చక్రాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అతను చేరుకోకపోయాడు. అతను సైకిల్‌ను ముందుకు వంచగానే.. బాలుడు పడిపోయాడు. పిల్లాడికి బలంగా దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది,
View this post on Instagram
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో deepakprajapat1580 అనే IDతో షేర్ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటివరకు 10.8 మిలియన్లు అంటే 1 కోటి 8 లక్షల వ్యూస్ వచ్చాయి, అయితే 6 లక్షలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది. (Source )
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి
Also Read:Char dam: చార్‌ధామ్ యాత్రికులకు ఊరట.. ఇకపై ఆ నిబంధనలు తొలగింపు
Heat Wave: అత్యవసరమైతేనే బయటకు రండి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక..