Pawan Kalyan: పవన్ తేజుల మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధం.. తుది దశలో ప్రీ ప్రొడక్షన్ పనులు.. సెట్స్​పైకి వెళ్ళేది ఎప్పుడంటే..

Pavan Kalyan and SaiDharam Tej: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్(Vakeel saab), భీమ్లా నాయక్(Bheemla nayak) సినిమాల హిట్ తర్వాత వరస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో..

Pawan Kalyan: పవన్ తేజుల మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధం.. తుది దశలో ప్రీ ప్రొడక్షన్ పనులు.. సెట్స్​పైకి వెళ్ళేది ఎప్పుడంటే..
Pawan Kalyan Sai Dharam Tej
Follow us
Surya Kala

|

Updated on: Apr 30, 2022 | 4:58 PM

Pavan Kalyan and SaiDharam Tej: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్(Vakeel saab), భీమ్లా నాయక్(Bheemla nayak) సినిమాల హిట్ తర్వాత వరస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.. మరోవైపు భవదీయుడు భగత్ సింగ్ కూడా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని షూటింగ్ కు రెడీ అవుతుంది.  అయితే తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మరో రీమేక్ మూవీ కూడా పట్టాలెక్కడానికి ముహర్తం ఖరారు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్..

ప‌వ‌న్‌క‌ల్యాణ్,  సాయిధ‌ర‌మ్‌తేజ్.. మామ అల్లుళ్ల క‌ల‌యిక‌లో కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘వినోదయ సీత‌మ్’ ను తెలుగులో రూపొందించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. జూన్ లో పూజాకార్యక్రమం నిర్వహించి రెగ్యులర్ షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. తమిళ వెర్షన్‌కు ద‌ర్శక‌త్వం వ‌హించిన స‌ముద్రఖ‌ని తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించబోతున్నట్లు టాక్.  అయితే తెలుగులో వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసినట్లు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ లో ఈ ‘వినోదయ సీత‌మ్’ లో స‌ముద్రఖ‌ని, తంబిరామ‌య్య ప్రధాన పాత్రల్లో నటించగా.. తెలుగులో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లు నటించనున్నారు. యాక్సిడెంట్‌లో క‌న్నుమూసిన ఓ వ్యక్తి.. దేవుడి అంగీకారంతో తిరిగి తొంభై రోజుల పాటు జీవించే అవకాశాన్ని పొందిన తర్వాత ఏం జ‌రిగింద‌నే నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాదు.. విమర్శకుల ప్రసంశలు కూడా అందుకుంది. తెలుగులో జీస్టూడియోస్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మెగా హీరోలు ఒకే తెరపై కనిపించనుండడంతో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.

 Also Read: Acharya 1st Day Collections: బాక్సాఫీస్ వద్ద ఆచార్య ప్రభంజనం.. ఒక్కరోజే కలెక్షన్లతో దుమ్మురేపిన మెగా హీరోస్..

Viral Video: బాలుడు సైకిల్ మీద స్టంట్స్‌.. హఠాత్తుగా ముందు చక్రం ఊడడంతో ఊహించని పరిణామం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!