AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Climate change: వెన్నులో వణుకు పుట్టించే న్యూస్.. 2070నాటికి భూమ్మీద నివసించలేని పరిస్థితి!

నిప్పుల కుంపటి వెనుక మరో ఉపద్రవం ముంచుకొస్తుంది. కరోనా లాంటి మహమ్మారులు మానవాళిపై దండయాత్ర చేసే ఛాన్స్‌ ఉంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే 15వేల కొత్త వైరస్‌లు పుట్టుకొస్తాయన్న నిపుణుల అంచనాలు ఒంట్లో వణుకు పుట్టిస్తున్నాయి.

Climate change: వెన్నులో వణుకు పుట్టించే న్యూస్.. 2070నాటికి భూమ్మీద నివసించలేని పరిస్థితి!
Climate Change
Ram Naramaneni
|

Updated on: Apr 30, 2022 | 4:15 PM

Share

మండే ఎండలు రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయన్నది శాస్త్రవేత్తల అంచనా. 2070 నాటికి భూమిపై దాదాపు నివసించలేని పరిస్థితి ఉంటుందంటున్నారు. వేసవి – తేమ ఒకేసారి కొన్ని గంటల పాటు ఉంటే.. ఆ సమయంలో ఎండ తీవ్రత ఓ రేంజ్‌లో ఉంటుందని లెక్కలేస్తున్నారు.

7,877 కేంద్రాల్లో నమోదైన డేటాపై పరిశోధన భారత్, పాక్, బంగ్లా, వాయువ్య ఆస్ట్రేలియా

1980 నుంచి 2019 మధ్య వాతావరణ సమాచారం అందించే 7, 877 వేరు వేరు కేంద్రాల్లో గంటగంటకూ నమోదైన డేటాను పరిశోధకులు విశ్లేషించారు. ఉప-ఉష్ణమండల తీర ప్రాంతాల్లో తీవ్రమైన వేడి, తేమ కలిసిన వాతావరణం తరచూ రెట్టింపు అవుతున్నట్టు గుర్తించారు. ఇలాంటి ఘటనలు భారత్, పాక్‌, బంగ్లా, వాయవ్య ఆస్ట్రేలియా, ఎర్ర సముద్రం తీర ప్రాంతాలు, కాలిఫోర్నియా లోయల్లో కనిపిస్తున్నాయట.

నివాసాల నుంచి జంతువులు బయటికొచ్చే ఛాన్స్ మనుషులకి సోకితే మహమ్మారి ప్రబలే అవకాశం

వాతావరణ మార్పులు.. భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జంతువులు వాటి నివాసాల నుంచి బయటకు వచ్చే ఛాన్స్‌ ఉందంటున్నారు సైంటిస్ట్‌లు. అక్కడి నుంచి వచ్చి మనుషులకు దగ్గరగా వాటి ఆవాసాలను ఏర్పరుచుకునే ప్రమాదం ఉందంటున్నారు. సూక్ష్మజీవులు మనుషులకు సోకితే మహమ్మారి ప్రబలే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సమీప భవిష్యత్తులో వ్యాధులు ప్రబలేందుకు వాతావరణ మార్పులు ప్రధాన కారణం అవుతాయని వాళ్ల అధ్యయనాల్లో పేర్కొంటున్నారు.

భవిష్యత్తులో మరిన్ని వైరస్‌లతో పోరాటం తప్పదా?

జంతువుల నుంచి మనుషులకు సోకిందని భావిస్తున్న కోవిడ్-19 వైరస్‌తో ముప్పుతిప్పలు పడుతున్నాం. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వైరస్‌లతో పోరాడాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో జంతువులను తప్పుబట్టలేం. ఎందుకంటే.. మనిషి చేసే తప్పిదాల కారణంగానే సమస్య మానవాళికి శాపంగా మారుతోంది.

వింత వ్యాధుల నుంచి ఎన్నో సవాళ్లు 2070 నాటికి 15వేల కొత్త వైరస్‌లు

ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జంతువుల నుంచి మనుషులకు సోకే వైరస్‌లు త్వరలో కనిపించవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఇలాగే పెరిగితే రానున్న రోజుల్లో వ్యాధుల నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2070 నాటికి ఉష్ణోగ్రతలు మరింత పెరిగితే దాదాపు 15,000 కొత్త వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు జంతువుల నుంచి మానవులకు సోకుతాయని నిపుణుల అంచనా.

వ్యాధులు ముందు తరాలకు వెళ్లకుండా ఆపడం ఎలా?

వైరస్ వ్యాప్తికి కొన్ని ప్రాంతాలు హాట్ స్పాట్లుగా మారే ఛాన్స్ ఉంది. అందుకే అలాంటి వ్యాధులను ముందు తరాలకు వెళ్లకుండా మనవంతు ప్రయత్నం చేయాలి. అడవులను కాపాడాలి. పర్యావరణాన్ని పరిరక్షించాలి. అప్పుడే మనమంతా సేఫ్.. లేదంటే కోవిడ్ కంటే మరిన్ని డేంజర్‌ వైరస్‌లతో యుద్ధాన్ని మింంచిన పోరాటం చేయాల్సి రావొచ్చు.

Also Read: Puzzle: దిమాక్‌లో దమ్ము ఉంటే.. కళ్లల్లో పవర్ ఉంటే ఈ ఫోటోలో గుడ్లగూబను కనిపెట్టండి..?