AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puzzle: దిమాక్‌లో దమ్ము ఉంటే.. కళ్లల్లో పవర్ ఉంటే ఈ ఫోటోలో గుడ్లగూబను కనిపెట్టండి..?

Viral Photo: ఇది సోషల్ మీడియా యుగం. ప్రజంట్ అన్ని జనరేషన్స్ వాళ్లు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. మీ కోసం ఓ కఠినమైన పజిల్.

Puzzle: దిమాక్‌లో దమ్ము ఉంటే.. కళ్లల్లో పవర్ ఉంటే ఈ ఫోటోలో గుడ్లగూబను కనిపెట్టండి..?
Find The Owl
Ram Naramaneni
|

Updated on: Apr 30, 2022 | 3:12 PM

Share

Picture riddle: జీవతమే ఓ పెద్ద సవాల్… మనం తీసుకునే నిర్ణయాలను బట్టి.. వేసే అడుగులను బట్టి లైఫ్ మారిపోద్ది. ఒక్క క్షణం ఆలోచిస్తే ఒక పెద్ద సమస్య నుంచి బయటపడొచ్చు. ఒక్క తెలివైన నిర్ణయంతో ఆనందకరమైన ఫ్యూచర్ సొంతం చేసుకోవచ్చు. అందుకు ఆత్మవిశ్వాసం, పట్టుదల అవసరం. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్నారు చిన్నవైనా, పెద్దవైనా సరే టాస్కులు సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఉదాహరణకు.. ఆదివారరం వచ్చే న్యూస్ పేపర్ బుక్ చదువుతున్నప్పుడు ఏదైనా పజిల్ కనిపిస్తే.. దాన్ని సాల్వ్ చేసేవరకు ఒక పట్టాన కుదురుగా ఉండరు. ఇవే కాదు.. ఈ మధ్య సోషల్ మీడియా(Social Media)లో కూడా రకరకాల పజిల్స్ సర్కులేట్ అవుతున్నాయి. అందులో ఫోటో పజిల్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇవి నెటిజన్లతో రివర్స్ గేమ్ ఆడుకుంటున్నాయి. వీటికి పరిష్కారాలు కనిపెట్టడం మాములు విషయం కాదు. ఎంత సేపు ప్రయత్నించినా.. వీడని చిక్కుముడిగానే ఉంటాయి. మీ చూపుల్లో పవర్ ఉంటే వీటిని తక్కువ సమయంలోనే సాల్వ్ చేయవచ్చు. వీటిన సాల్వ్ చేస్తే.. మనసుకు హాయిగా ఉంటుంది. ఏదో సాధించిన ఫీలింగ్ కలుగుతుంది.  లేదంటే అసంతృప్తిగా. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట వైరల్ అవుతుంది. అది ఓ అడవిలో తీసినదిగా అర్థమవుతుంది.  ఆ ఫోటోలో ఒక గుడ్లగూబ దాగి ఉంది. దాన్ని కనిపెట్టడం చాలా కఠినం. ఎందుకంటే అక్కడి చెట్ల అది మిళితమై ఉంది. లేటెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి. తీక్షణంగా గమనిస్తే దాన్ని సులభంగా పట్టేయవచ్చు. పైపైన చూస్తే మాత్రం దొరకదు. ఎంత చూసిన లాభం లేదు అనుకుంటే దిగువన ఫోటో చూడండి.