ఈ ఫ్యాన్సీ నెంబర్‌కు క్రేజ్ మాములుగా లేదు.. ఏకంగా రూ. 7.6 లక్షలకు అమ్ముడైంది.!

వాహనదారులు కొత్త కార్లు కొనడం ఒక ఎత్తయితే.. వాటికీ ఫ్యాన్సీ నెంబర్లు ఎంపిక చేయడం మరో ఎత్తు. వాహనదారుడు ప్రతీ నెంబర్‌కు..

ఈ ఫ్యాన్సీ నెంబర్‌కు క్రేజ్ మాములుగా లేదు.. ఏకంగా రూ. 7.6 లక్షలకు అమ్ముడైంది.!
Car
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 02, 2021 | 5:49 PM

వాహనదారులు కొత్త కార్లు కొనడం ఒక ఎత్తయితే.. వాటికీ ఫ్యాన్సీ నెంబర్లు ఎంపిక చేయడం మరో ఎత్తు. వాహనదారుడు ప్రతీ నెంబర్‌కు ఓ ప్రత్యేకత ఉందని భావిస్తాడు. ‘1’ నాయకత్వానికి సూచిక అయితే.. ‘9’ అందరూ ఇష్టపడే నెంబర్. దాదాపు చాలామంది ఈ నెంబర్ కోసం పోటీ పడతారు. ఎంత ఖర్చైనా పెట్టడానికి ఇష్టపడతారు. గతంలోనూ ఈ పోటీ జరగ్గా.. తాజాగా అదే సీన్ రిపీట్ అయింది.

కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో కార్ల అమ్మకాలు తగ్గినా.. ఫ్యాన్సీ నెంబర్ల డిమాండ్ మాత్రం తగ్గలేదు. తాజాగా ‘TS09 FR 9999’ అనే నెంబర్‌ను ఓ వాహనదారుడు ఏకంగా రూ. 7.6 లక్షలు పెట్టి సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ‘9999’ మరోసారి ఆల్‌టైం రికార్డు ధరకు అమ్ముడైంది. సాధారనంగ్ ఆల్ నైన్ నెంబర్‌కు పోటీ మాములుగా ఉండదు. గతంలోనూ రూ. 9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు అమ్ముడైన సందర్భాలు లేకపోలేదు.

ఈ ఆల్ నైన్ నెంబర్‌తో పాటు ‘TS09 FS 0009′ అనే మరో నెంబర్ కూడా సుమారు రూ. 6.5 లక్షలకు పైగా వేలంలో అమ్ముడైనట్లు సమాచారం. తాజాగా నిర్వహించిన ఈ-వేలంలో రవాణాశాఖకు ఒక్కరోజులోనే రూ. 30 లక్షలకు మేరకు ఆదాయం లభించింది.

కాగా, ప్రస్తుతం క్రేజ్ ఉన్న నెంబర్లతో పాటు ఆదరణ లేని నెంబర్లకు కూడా డిమాండ్ బాగా ఉన్నట్లు తెలుస్తోంది.’TS 09 FC 0001’, ‘TS09FC0005’ నెంబర్లు గతంలో రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు అమ్ముడయ్యాయి. కొంతమంది జోతిష్యం, సంఖ్యాశాస్త్రంపై నమ్మకంతో ఆయా నెంబర్లకు అధిక శాతంలో డబ్బులు ఖర్చుపెడితే.. మరికొందరు కొన్ని నెంబర్లు తమకు అదృష్టాన్ని తీసుకోస్తాయనే నమ్మకంతో ఆసక్తిని కనబరుస్తారు.

Also Read: 

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..

సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. 48 బంతుల్లో శతకం.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆ ఓపెనర్ ఎవరంటే.!

రెస్టారెంట్‌ను పేల్చేస్తానంటూ కస్టమర్ ఫోన్.. కారణం ఆరా తీయగా మైండ్ బ్లాంక్.!