Minister KTR: నూతన జోనల్ వ్యవస్థతో ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే.. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తే, ప్రత్యేక ప్రోత్సాహకాలుః మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందన్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్.

Minister KTR: నూతన జోనల్ వ్యవస్థతో ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే.. ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తే, ప్రత్యేక ప్రోత్సాహకాలుః మంత్రి కేటీఆర్
Minister Ktr
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 02, 2021 | 3:56 PM

Minister KTR on Zonal system: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఈ మేరకు సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్‌తో జోనల్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించి, అమలులోకి తీసుక వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల నేపథ్యంలో ఉన్న పాత జోనల్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, తెలంగాణ లోని అన్ని ప్రాంతాల ఆకాంక్షల మేరకు నూతన జోనల్ వ్యవస్థ రూపుదిద్దుకుందని కేటీఆర్ అన్నారు.

ఇటీవల జోనల్ వ్యవస్థ కొత్త ప్రతిపాదనలకు కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీవో విడుదల చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు పాలన ప్రయోజనాలను ప్రజలకు వేగంగా తీసుకువెళ్లేందుకు జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగిందన్నారు. ఆయా జిల్లాలను ప్రత్యేక జోన్లుగా వర్గీకరించడంతో జిల్లా స్థాయి పోస్టయిన జూనియర్ అసిస్టెంట్ నుంచి మొదలుకొని జోన్లు, మల్టీ జోన్ ఉద్యోగాల వరకు ఉన్న అన్ని స్థాయిల ఉద్యోగాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాల్లో సమన్యాయం జరుగుతుందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణ్ పేట జిల్లాలను ఆయా జోన్లలో చేర్చి చట్టబద్ధం చేయడంతో పాటు, వికారాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు ఆ జిల్లాను చార్మినార్ జోన్ పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు.

ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని మించి వివిధ శాఖల ద్వారా 1,33,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర యువతకు అందించామన్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కాకుండా గత ఏడేళ్లలో టీఎస్ ఐపాస్ విధానం ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేల పరిశ్రమలు రాష్ట్రంలోకి ఆకర్శించగలిగామని మంత్రి కేటీఆర్ వివరించారు. తద్వారా సుమారు 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వచ్చాయన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అవకాశాలు దక్కేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలలో ఇక్కడి యువతకు మరిన్ని ఉద్యోగాలు ఇస్తే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా మరో విధానపరమైన నిర్ణయం తీసుకున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఇక్కడ ప్రస్తావించారు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగాల్లో స్థానిక యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలు దొరికేలా చర్యలు తీసుకుటున్నామన్నారు.

Read Also…  Union Minister on farm laws: కొత్త సాగు చట్టాలపై కేంద్ర మంత్రి తోమర్ కీలక వ్యాఖ్యలు.. శరద్ పవార్ సూచనలు పరిగణంలోకి తీసుకుంటామని స్పష్టం