ఎమ్మార్వో ఆఫీసు గుమ్మానికి మంగళసూతం కట్టి మహిళ వినూత్న నిరసన..!వైరల్ అవుతున్న వీడియో..:Rajanna Sircilla video.
Woman protest against Rudrangi Tahsildar : తాళిబొట్టు తీసుకొని తన భూమి తనకు పట్టా చేయాలని ఓ మహిళ నిరసనకు దిగింది. తన భూమి పట్టా కోసం.. మంగళసూత్రాన్ని.. తహసీల్దార్ ఆఫీసుకు కట్టింది ఆ మహిళ. తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగి.. తిరిగి విసిగి వేశారిపోయి చివరకు ఈ నిర్ణయం తీసుకుంది.
తాళిబొట్టు తీసుకొని తన భూమి తనకు పట్టా చేయాలని ఓ మహిళ నిరసనకు దిగింది. తన భూమి పట్టా కోసం.. మంగళసూత్రాన్ని.. తహసీల్దార్ ఆఫీసుకు కట్టింది ఆ మహిళ. తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగి.. తిరిగి విసిగి వేశారిపోయి చివరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్ని సార్లు అధికారులను బ్రతిమాలినా పట్టించుకోలేదని, పట్టా కోసం యేళ్ల తరబడి తిరుగుతునే ఉన్నా ఫలితం లేకపోవడంతో చివరికి ఆమె, తన మాంగళ్యాన్ని ఆఫీసు గుమ్మానికి వ్రేలాడగట్టింది.వివరాల్లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన దంపతులు పొలాస రాజేశం, మంగ. వీరికి సర్వే నెంబర్ 130/14లో 2 ఎకరాల భూమి ఉంది. అయితే, మంగ భర్త రాజేశం మూడు సంవత్సరాల క్రితం చనిపోగానే వేరే వాళ్ళకి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆ భూమిని పట్టా చేశారు. అయితే, తన భూమిని అన్యాయంగా వేరే వాళ్లకి పట్టా చేశారని.. తన భూమిని తనకు పట్టా చేయాలని మూడు సంవత్సరాలుగా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతునే ఉంది మంగ. అయినా అధికారుల్లో చలనం లేకపోయింది.
మరిన్ని ఇక్కడ చూడండి: సినీ ఫక్కీలో క్రిమినల్ అరెస్ట్..!గ్యాంగ్‌స్టర్‌ను చుట్టుముట్టిన క్రైం బ్రాంచ్ పోలీసులు..ట్రెండ్ అవుతున్న వీడియో:police video.
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
