నీటి మంటలు సాగర్‌లో టెన్షన్.. రోజు రోజుకు ముదురుతున్న జలవివాదం..రంగంలోకి దిగిన పోలీసులు..:controversy on water projects video.
controversy on water projects:కృష్ణా జలవివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రాజెక్టులన్నీ పోలీసు పహారాలోకి వెళ్లాయి. జూరాల మొదలుకొని పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. నాగార్జునసాగర్ వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలని మాట్లాడేందుకు వస్తున్న ఏపీ అధికారులకు నో ఎంట్రీ అంటున్నారు తెలంగాణ పోలీసులు.
కృష్ణా జలవివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రాజెక్టులన్నీ పోలీసు పహారాలోకి వెళ్లాయి. జూరాల మొదలుకొని పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి. నాగార్జునసాగర్ వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలని మాట్లాడేందుకు వస్తున్న ఏపీ అధికారులకు నో ఎంట్రీ అంటున్నారు తెలంగాణ పోలీసులు..పులిచింతల వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ ఆ ప్రాజెక్టు ఎస్.ఇ తెలంగాణ జెన్‌కో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. జూరాల డ్యాంపైకి తెలంగాణ రాకపోకలు నిలిపివేయగా, ఆర్డీఎస్ కుడికాలువ వద్ద ఏపీ.. పోలీసు బలగాలను మోహరించింది. శ్రీశైలం వద్ద రెండు రాష్ట్రాలు పోలీసులను మోహరించగా, పోతిరెడ్డిపాడు వద్ద పోలీసులను పెంచి ఆంధ్రప్రదేశ్ ఎవరినీ అనుమతించడం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ జిల్లాల ఎస్పీలు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.జూరాల నుంచి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్రప్రదేశ్ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని తెలంగాణ గట్టిగా కోరుతోంది. అయితే 841 అడుగుల దిగువన ఉన్నప్పుడు నీటిని తీసుకోవడానికి అవకాశం లేదంటూ రాయలసీమ ప్రాజెక్టును కొనసాగించడానికి ఏపీ ప్రయత్నిస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి:జనసంచారంలో మొసలి విహారయాత్ర..! వీధుల్లో మొసలి తీరుగుతున్న షాకింగ్ వీడియో వైరల్:crocodile romeing on roads video.
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
