మోదీకి మామిడి పండ్లు పంపించిన దీదీ..! తన సంప్రదాయం పై ప్రశంసలు అందుకున్న మమతా బెనర్జీ :Mamata Banerjee Video.
Mamata Banerjee sends Mangoes to PM Modi:తనదైన మాటల దాడితో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేయడంలో ఆమెకు మరెవరు సాటిలేరు. మోదీ, అమిత్‌షా లాంటి హేమాహేమిలను సైతం ఢీకొట్టి నిలిచే ధైర్యం. ఇవన్నీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకే సొంతం అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించే దీదీ… ఒక్క విషయంలో మాత్రం చాలా ఔదర్యంగా వ్యవహరిస్తుంటారు. అదే ప్రతీ ఏటా ఢిల్లీలో ఉండే పెద్దలకు తమ రాష్ట్రానికి చెందిన మామిడి పండ్లను అందించడం. బెంగాల్‌కు ప్రత్యేకంగా నిలిచే హిమసాగర్, మాల్దా, లక్ష్మణ్ భోగ్ రకాల మామిడి పండ్లను ప్రతీ ఏటా ప్రధాని మోడీతో పాటు పలువురు జాతీయ నేతలకు పంపించడాన్ని మమతా ఒక సంప్రదాయంగా పాటిస్తున్నారు.ఇక తాజాగా పశ్చిమమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీతో పాటు అమిత్‌షాను ఢీకొట్టి విజయాన్ని సాధించి సీఎం పీఠాన్ని అదిరోహించిన మమతా.. ఈసారి కూడా పాత సంప్రదాయాన్ని కొనసాగించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా మామిడి పండ్లను తెప్పించిన మమతా బెనర్జీ.. ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, రాష్టపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా మామిడి పండ్లను పంపించారు. ఎన్నికల సమయంలో యుద్ధ వాతవరణాన్ని తలపించిన తర్వాత కూడా మమత తన సంప్రదాయాన్ని కొనసాగించడం పట్ల దీదీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: రోడ్డుపై లిఫ్ట్ అడిగిన పాము పల్టీ కొట్టిన బైకర్స్.ట్రాఫిక్ రూల్స్ పాటించనివారిపై స్నేక్ అటాక్!ఫన్నీ వీడియో..:Funny Video.
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
