AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: BRS నేత జేబు నుంచి డబ్బు చోరీ.. నిందితుడి వాట్సాప్ చాట్ చూసి పోలీసులు షాక్

వివరాల్లోకి వెళ్తే.. చార్మినార్‌ పటేల్‌బుర్జ్‌కు చెందిన బీఆర్‌ఎస్ లీడర్ జైపాల్‌రెడ్డి ఈనెల 27న తెలంగాణ భవన్‌లో జరిగిన మైనార్టీ సంక్షేమ సదస్సుకు అటెండ్ అయ్యారు. బయటకు వెళ్తున్నాం.. అందులో పార్టీ మీటింగ్.. ఏం అవరసమొస్తుందో అని జేబులో రూ.50 వేలు పెట్టుకున్నారు. కాగా సదస్సుకు హాజరైన వారికి మధ్యాహ్నం ఆహారాన్ని అందిస్తున్న క్రమంలో....

Hyderabad: BRS నేత జేబు నుంచి డబ్బు చోరీ.. నిందితుడి వాట్సాప్ చాట్ చూసి పోలీసులు షాక్
Thief
Ram Naramaneni
|

Updated on: Jan 31, 2024 | 9:43 AM

Share

హైదరాబాద్, జనవరి 31: దొంగలు..బాబోయ్ దొంగలు.. ఖతర్నాక్ దొంగలు.. కనురెప్పపాటులో జేబులు గుల్ల చేసే దొంగలు. వీఐపీలు ఉండే ప్రాంతాలనే టార్గెట్‌గా పెట్టుకుంటారు. కనికట్టు మాయాజాలంతో జేబులు కొట్టేస్తారు. ఏకంగా తెలంగాణ భవన్‌లోనే ఓ నాయకుడి నుంచి 50 వేలు కొట్టేశారు. వారిలో ఒకరిని బంజారాహిల్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఆ చోరుడి వాట్సాఫ్ చాటింగ్ చూసి ఖాకీలు స్టన్ అయ్యారు.  ‘అరెయ్‌.. నువ్వు రమ్మంటే వినలేదు..! రూ. 50వేలు పడ్డాయి.. నువ్వు వస్తే నీకు షేర్ వచ్చేది కదా..’ అంటూ మరో ఫ్రెండ్‌కు మెసేజ్ పంపాడు ఈ దొంగ.

వివరాల్లోకి వెళ్తే.. చార్మినార్‌ పటేల్‌బుర్జ్‌కు చెందిన బీఆర్‌ఎస్ లీడర్ జైపాల్‌రెడ్డి ఈనెల 27న తెలంగాణ భవన్‌లో జరిగిన మైనార్టీ సంక్షేమ సదస్సుకు అటెండ్ అయ్యారు. బయటకు వెళ్తున్నాం.. అందులో పార్టీ మీటింగ్.. ఏం అవరసమొస్తుందో అని ఆయన జేబులో రూ.50 వేలు పెట్టుకున్నారు. కాగా సదస్సుకు హాజరైన వారికి మధ్యాహ్నం భోజనం అందిస్తున్న క్రమంలో జైపాల్‌రెడ్డి జేబులోని రూ.50వేలు దొంగలు చోరీ చేశారు. ఇదే మీటింగ్‌కు హాజరైన గోల్కొండ ఫోర్ట్‌ ఏరియాకు చెందిన అజంఖాన్‌, చింతలబస్తీ వీర్‌నగర్‌కు చెందిన శశిధర్‌ జేబుల్లోని సెల్‌ఫోన్లు సైతం మాయమయ్యాయి. దీంతో ముగ్గురూ బంజారాహిల్స్‌ పోలీసులకు వేర్వేరుగా కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ భవన్‌లో గతంలో జరిగిన మీటింగ్స్‌కు హాజరైన వారి జేబులు గుళ్ల చేసిన మరో రెండు సంఘటనల్లోనూ నిందితులను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్