AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anuradha Aunty: కుమారి ఆంటీ తర్వాత ఈమే.. టేస్ట్‌లో రాజీ లేదు.. నెల సంపాదన ఎంతంటే..?

హైదరాబాద్ అంటే.. ఫుడ్ బిజినెస్‌కు కేరాఫ్ అడ్రస్. తక్కువ డబ్బుతో మంచి టేస్టీ ఫుడ్ తినాలంటే హైదరాబాద్‌కు మించిన ప్లేస్ ఇంకోటి ఉండదు. ఇక హైదరాబాదీ ఫేమస్ బిర్యానీ గురించి దేశవిదేశాల్లోని అందరూ మాట్లాడుకుంటారు. ఈ మధ్యకాలంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కూడా విపరీతంగా పెరిగింది. సంపన్నులు సైతం రోడ్డు సైడ్ ఫుడ్‌ని ఆస్వాదిస్తున్నారు.

Anuradha Aunty: కుమారి ఆంటీ తర్వాత ఈమే.. టేస్ట్‌లో రాజీ లేదు.. నెల సంపాదన ఎంతంటే..?
Anuradha Aunty
Ram Naramaneni
|

Updated on: Jan 31, 2024 | 1:20 PM

Share

హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది ఇరానీ ఛాయ్, బిర్యానీ. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్‌కి ఫ్యాన్స్ పెరిగిపోయారు. మన దగ్గర రోడ్ సైడ ఫుడ్ మంచి టేస్ట్ ఉండటమే కాదు.. ధర కూడా చాలా తక్కువ. ఈ మధ్య కాలంలో కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఆమె అందించే వెజ్, నాన్ వెజ్ వంటకాలకు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. హైదరాబాద్ వాళ్లు మాత్రమే కాదు.. వేరే, వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి కుమారి ఆంటీ ఫుడ్‌ను టేస్ట్ చేసేవాళ్లు. అయితే క్రౌడ్ పెరిగిపోయి.. ట్రాఫిక్ సమస్యలు రావడంతో ఆమె ఫుడ్ స్టాల్‌ను క్లోజ్ చేయాలని పోలీసులు చెప్పడం చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో ఉండే మరో ఫుడ్ స్టాల్‌ను మీకు పరిచయం చేయబోతున్నాం. ITC కోహెనూర్ హోటల్‌, ఇనార్బిట్ మాల్ సమీపంలోనే  ఈ అనురాధ ఆంటీ ఫుడ్ సెంటర్ కూడా ఉంటుంది.  ఈమె వద్ద రుచికరమైన దాల్ రైస్, గోంగూర రైస్,  గోబీ రైస్, టమాటా రైస్,  జీరా రైస్, పెరుగన్నం ఉంటాయి. నాన్ వెజ్ విషయానికి వస్తే చికెన్, మటన్, లివర్, తలకాయ,  ఫిష్, ఫ్రాన్స్ ఇలా అన్ని నాన్ వెజ్ వంటలు లభిస్తాయి. వెజ్ తింటే ప్లేట్‌కు 80 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రైస్ అన్‌లిమిటెడ్.

రేట్లు ఇలా

  • చికెన్ కర్రీ  – 120 రూపాయలు (అన్‌లిమిటెడ్ వైట్ రైస్ లేదా బగారా అన్నంతో)
  • చికెన్ ఫ్రై –  150 రూపాయలు  (అన్‌లిమిటెడ్ వైట్ రైస్ లేదా బగారా అన్నంతో)
  • మటన్ కర్రీ  – 200 రూపాయలు (అన్‌లిమిటెడ్ వైట్ రైస్ లేదా బగారా అన్నంతో)
  • మటన్ లివర్‌తో రైస్  రూ.150
  • మటన్ లివర్‌తో రైస్  రూ.150
  • ప్రాన్స్ కర్రీతో రైస్ రూ. 150
  • ఫిష్ కర్రీతో రైస్ రూ. 150
  • ఆమె వద్ద ఉన్న అన్ని నాన్ వెజ్ ఐటమ్స్‌తో ఫుడ్ తీసుకుంటే రూ. 450

రోజుకు 300 వందల మంది వరకు ఆమె వద్ద ఫుడ్ తింటారు. ఒక్కో పర్సన్‌కు యావరేజ్ 100 రూపాయలు లెక్కన వేసుకున్నా.. రోజుకు 30000 కౌంటర్ ఉంటుంది. అన్ని ఖర్చులు పోతే 10 వేలు మిగలవచ్చు. ఈ లెక్కన ఆమెకు నెలకు 3 లక్షల వరకు లాభం వచ్చే చాన్స్ ఉంటుంది.

ఏది ఏమైనా కుమారి ఆంటీ విషయం రేవంత్ రెడ్డి వరకు వెళ్లడంతో.. ఆమె అక్కడే ఫుడ్ స్టాల్ నిర్వహించేందుకు అనుమతులు వచ్చాయి. పెద్ద, పెద్ద ఫైవ్ స్టార్ హోటళ్ల కంటే.. ఇలా రోడ్ సైడ్ ఫుడ్ పెట్టుకునేవారికి మంచి జరిగితే అంతకు మించిన తృప్తి ఏముంటుంది. వీళ్ల వద్ద జీఎస్టీలు, ట్యాక్స్‌లు ఏం ఉండవ్. ఇలా రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముతూ.. తక్కువ రేటుకే ఇన్ని వందల మంది కడుపు నింపుతున్న కుమారి ఆంటీ, అనురాధ ఆంటీ లాంటి వారందరూ.. చల్లగా ఉండాలని మనం కోరుకుందాం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..