AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Job Notifications: ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చేనా..? కోటి ఆశలతో నిరుద్యోగుల ఎదురు చూపులు..

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక.. కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు అయింది. ఇప్పుడు టీఎస్పీయస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి నేతృత్వంలోని టీమ్ నియామక ప్రక్రియపై ఎప్పుడు తీపి కబురుచెబుతుందా? అని లక్షలాది నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో వచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు జరిపినవి రద్దు కాగా మరికొన్ని..

TSPSC Job Notifications: ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చేనా..? కోటి ఆశలతో నిరుద్యోగుల ఎదురు చూపులు..
TSPSC
Vidyasagar Gunti
| Edited By: Srilakshmi C|

Updated on: Jan 31, 2024 | 11:02 AM

Share

హైదరాబాద్, జనవరి 31: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక.. కొత్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు అయింది. ఇప్పుడు టీఎస్పీయస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి నేతృత్వంలోని టీమ్ నియామక ప్రక్రియపై ఎప్పుడు తీపి కబురుచెబుతుందా? అని లక్షలాది నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో వచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు జరిపినవి రద్దు కాగా మరికొన్ని పరీక్షలను అసలు నిర్వహించనేలేదు. మరి వీటన్నింటిని కొత్త కమిషన్ ఏం చేయబోతుంది? అనేది ఆసక్తిగా మారింది. TSPSC చైర్మన్ మహేందర్ రెడ్డి సహా మరో ఐదుగురు సభ్యులను నియమిస్తూ ఇటీవల గవర్నర్ ఆమోదంతో సర్కారు కొత్త సర్వీస్ కమిషన్ బోర్డును ఏర్పాటు చేసింది.

ఇప్పుడు ఈ కమిషన్ కాంగ్రెస్ ఇచ్చిన అభయహస్తం హామీలోని జాబ్ కాలెండర్ విడుదల, గత పరీక్షల తప్పిదాలను సరిదిద్ది నియామకాలు చేపట్టడంపై ఫోకస్ పెట్టింది. చైర్మన్ సహా సభ్యులు చార్జ్ తీసుకొని టీఎస్ పీఎస్ సీ కార్యాలయంలో వరస సమీక్షలు చేస్తున్నారు. గ్రూప్ 1, 2, 3, 4 నోటిఫికేషన్ల పరిస్థితి, మిగిలిన నియామకాలు, జాబ్ కాలెండర్ కోసం కొత్త ఖాళీలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. నిలిచిపోయిన ఉద్యోగ నియామక ప్రక్రియను రీస్టార్ట్ చేసేందుకు ఎలా ముందుకు వెళ్లాలో తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వం 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ ను జారీ చేయగా పేపర్ లీకేజీతో ఒకసారి, బయోమెట్రిక్ ఇష్యూతో రెండోసారి రాసిన ప్రిలిమినరీ పరీక్ష రద్దు అయింది. దీనిమీద కొత్త కమిషన్ మరికొన్ని పోస్టులు యాడ్ చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 780 పోస్టులకు గ్రూప్ -2 నియామక పరీక్ష ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. దీనికి కూడా కొత్తగా మరికొన్ని పోస్టులను జతచేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గ్రూప్ -3 నోటిపికేషన్‌లో 1380 పోస్టులు ఇచ్చినా ఎగ్జామ్ నిర్వహించలేదు. దీన్ని కూడా రీషెడ్యూల్‌ చేసే ఛాన్స్ ఉంది. 8,039 పోస్టులతో గ్రూప్-4 పరీక్ష నిర్వహించి ఫైనల్ కీ కూడా రిలీజ్ చేశారు. ఫలితాల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఈ నేపథ్యంలో టీఎస్పీయస్సీ నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రకటన వస్తుందో అని ఎంతో ఆశగా నిరుద్యోగులు కాచుకు కూర్చున్నారు. అలాగే ఈ ఏడాది చివరి నాటికి 2 లక్షల జాబ్‌లు ఇస్తామన్న సీఎం రేవంత్ ప్రకటన ప్రకారం.. జాబ్ కాలెండర్‌ను రిలీజ్ చేస్తే ఎప్పుడు ఏ నోటిఫికేషన్లు వస్తాయో ఓ క్లారిటీ రానుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.