Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన పోకిరి.. చివరకు ఎలా దొరికాడో తెలుసా..?

రాచకొండ పరిధిలో ఇటీవల పోకిరిల ఆగడాలు మితిమీరాయి. అయితే ఇటీవల కాలంలో ఒక పోకిరి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. అయితే గత సెప్టెంబర్ 21న ఒక పోకిరి చేసిన పనికి రాచకొండ పోలీసులు ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. బైక్ నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుండా మొహానికి మాస్క్ ధరించి మహిళలను వేధింపులకు గురిచేశాడు ఆ పొకిరి.

Telangana: పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన పోకిరి.. చివరకు ఎలా దొరికాడో తెలుసా..?
Police Arrested Accused Per
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 02, 2024 | 12:56 PM

రాచకొండ పరిధిలో ఇటీవల పోకిరిల ఆగడాలు మితిమీరాయి. ఒంటరిగా వెళ్తున్న మహిళలను టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయా పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి పోకిరిలకు అడ్డుకట్టు వేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఒక పోకిరి పోలీసులను తెగ ఇబ్బంది పెట్టాడు.

సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో సుమారు 268 మంది పోకిరిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వివిధ సందర్భాల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన ఫిర్యాదులు లభించాయి. దీనికి అదనంగా సాక్షాదారాలతో సహా వీరిని షీ టీమ్స్ రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.

అయితే సెప్టెంబర్ నెల 21న ఒక పోకిరి చేసిన పనికి రాచకొండ పోలీసులు ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది. బైక్ నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుండా మొహానికి మాస్క్ ధరించి మహిళలను వేధింపులకు గురిచేశాడు ఆ పొకిరి. అదేరోజు నాలుగు కిలోమీటర్ల వ్యవధిలో పలుమార్లు పలువురు యువతులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై  బాధిత యువతులు రాచకొండ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాచకొండ షీ టీమ్స్ పోలీసులు పోకిరిని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.

చివరికి ఆ పోకిరిని పోలీసులు ఎలా పట్టుకున్నారు?

ఈ ఒక్క పోకిరి కోసం దాదాపు వందలాది సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అయితే నిందితుడు బాధితులను వేధింపులకు పాల్పడే సమయంలో మొహానికి మాస్క్ ధరించి ఉండటంతో పాటు అతడు వాడిన టూ వీలర్ వాహనానికి నంబర్ ప్లేట్ సరిగ్గా లేదు. దీంతో పోలీసులకు ఈ పోకిరిని పట్టుకోవడం సవాలుగా మారింది. నంబర్ ప్లేట్ కొద్ది వరకు కనిపిస్తున్న పూర్తిగా లేకపోవడంతో పోలీసులు మరింత కష్టపడాల్సి వచ్చింది. ఆ నంబర్ సిరీస్‌తో ఉన్న వాహనాల కోసం ఆర్టిఏ కార్యాలయానికి వెళ్లి వెరిఫై చేశారు. ఆ నంబర్‌కు దగ్గరలో ఉన్న దాదాపు 300కు పైగా బైక్‌లను పోలీసులు గుర్తించారు. ఒక్కొక్క దాన్ని వెరిఫై చేసుకుంటూ వెళ్లి చివరకు నిందితుడిని పట్టుకున్నారు.

మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి