AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Weather: మరో మూడు రోజులు వర్షాలే.. ఉరుములు, మెరుపులతో భారీ వానలు.. ఆ జిల్లాలకు అలర్ట్..

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెండు రోజులుగా హైదరాబాద్ లో దంచి కొడుతున్న వానలు.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయని తెలిపారు. ఉత్తర భార‌తం..

Telangana Weather: మరో మూడు రోజులు వర్షాలే.. ఉరుములు, మెరుపులతో భారీ వానలు.. ఆ జిల్లాలకు అలర్ట్..
Ap Weather Alert
Ganesh Mudavath
|

Updated on: Sep 28, 2022 | 7:44 AM

Share

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రెండు రోజులుగా హైదరాబాద్ లో దంచి కొడుతున్న వానలు.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నాయని తెలిపారు. ఉత్తర భార‌తం నుంచి తిరోగ‌మ‌నంలో ప‌య‌నిస్తున్న నైరుతి రుతుప‌వ‌నాలు తెలంగాణ‌పై నుంచి చురుగ్గా క‌దులుతున్నాయి. దీనితో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉప‌రిత‌ల ఆవ‌ర్తనం స‌ముద్ర మ‌ట్టానికి 3.1 కిలోమీట‌ర్ల ఎత్తున స్థిరంగా ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 30 వ‌ర‌కు రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. ఉరుములు, మెరుపుల‌తో కూడిన వానలు పడతాయని పేర్కొన్నారు. పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల‌పల్లి, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

కాగా.. మంగళవారం భాగ్యనగరంపై కుండపోత వాన కురిసింది. నగరవాసులపై తన ప్రతాపం చూపించాడు. వరుసగా రెండో రోజూ హైదరాబాద్ పై వరుణుడు విరుచుకుపడ్డాడు. నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకాపూల్‌, కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, ప్యాట్నీ, అబిడ్స్, నారాయణగూడ, హైదర్‌గూడ, నాంపల్లి, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, హిమాయత్‌నగర్‌, మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, చిలకలగూడ, బేగంపేట్‌, అల్వాల్‌, ప్యారడైజ్‌ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

సోమవారం సాయంత్రం కూడా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. అర్ధరాత్రి వరకూ కురుస్తూనే ఉంది. బేగంపేట్, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, వనస్థలిపురం, కోఠి, ప్రాంతాల్లో వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో మరో రెండ్రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కామాఖ్య దర్శనానికి వెళ్తున్నారా? జూన్ 15 నుంచి ఆఫ్‌లైన్ టిక్కెట్ల
కామాఖ్య దర్శనానికి వెళ్తున్నారా? జూన్ 15 నుంచి ఆఫ్‌లైన్ టిక్కెట్ల
ఈ బట్టలు వాషింగ్ మెషిన్‌లో వేస్తున్నారా..? అస్సలు వేయకండి..
ఈ బట్టలు వాషింగ్ మెషిన్‌లో వేస్తున్నారా..? అస్సలు వేయకండి..
ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా రికార్డు
ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా రికార్డు
పంచామృతంలో తులసి ఎందుకు తప్పనిసరి? మహావిష్ణువు పూజలోని ఈ రహస్యం..
పంచామృతంలో తులసి ఎందుకు తప్పనిసరి? మహావిష్ణువు పూజలోని ఈ రహస్యం..
బంగారం ఇప్పుడే కొనకండి.. ధర భారీగా తగ్గే ఛాన్సుంది!
బంగారం ఇప్పుడే కొనకండి.. ధర భారీగా తగ్గే ఛాన్సుంది!
కుక్కలు వెంబడిస్తే బైక్ వేగం పెంచడం కరెక్టేనా?
కుక్కలు వెంబడిస్తే బైక్ వేగం పెంచడం కరెక్టేనా?
జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ లేదా ఏసీ కోచుల్లోకి వెళుతున్నారా..?
జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ లేదా ఏసీ కోచుల్లోకి వెళుతున్నారా..?
ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ ఫిక్స్!
ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ ఫిక్స్!
తితిరుగులేని స్టార్‌డమ్.. కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు.. కానీ
తితిరుగులేని స్టార్‌డమ్.. కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు.. కానీ
‘నక్క తోక తొక్కాడు’ అంటే ఏమిటి? ఇందులోని నక్క అసలు నక్కే కాదు..
‘నక్క తోక తొక్కాడు’ అంటే ఏమిటి? ఇందులోని నక్క అసలు నక్కే కాదు..