Sheshanna Arrest: నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్‌.. అధికారికంగా ప్రకటించిన పోలీసులు..

నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు మంగళవారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు.

Sheshanna Arrest: నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్‌.. అధికారికంగా ప్రకటించిన పోలీసులు..
Gangster Nayeem -Sheshanna
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 28, 2022 | 12:11 AM

నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు మంగళవారం రాత్రి అధికారిక ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ గోల్కొండ పోలీసుల సాయంతో శేషన్నను టాస్క్ ఫర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైట్‌కలర్‌ కారులో వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ తెలిపారు. నానక్రాంగూడ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఆ సమయంలో అతని దగ్గర 9 ఎంఎం గన్‌ లభించినట్లు తెలిపారు. శేషన్న అలియాస్‌ పెద్దన్న.. నయీంతో కలిసి అనేక మందిని కిడ్నాప్‌ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. అనేక ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు, చేయడమే కాకుండా మర్డర్లు చేసినట్టు గుర్తించారు. తుపాకులను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడేవారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

మొత్తం 9 కేసుల్లో శేషన్న నిందితుడిగా ఉన్నాడు. ఐపీఎస్ వ్యాస్, మాజీ మావోయిస్టు నేత పటోళ్ల గోవర్ధన్‌రెడ్డి.. హత్య కేసులో శేషన్న ప్రధాన నిందితుడు. అచ్చంపేట, ఉట్కూరు పీఎస్‌లలో శేషన్నపై కేసులు ఉన్నాయి. పహాడీషరీఫ్‌, అచ్చంపేట, నల్గొండ టూటౌన్‌.. హుమాన్‌నగర్‌ పీఎస్‌లలో ఉన్న పలు కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నాడు శేషన్న. నయూంతో కలిసి శేశన్న అనేక దందాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా చాలామంది నక్సలైట్లు, మావోయిస్టులతో శేషన్నకు సంబంధాలు ఉన్నాయన్నారు. హత్య కేసులు సహా ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..