Hyderabad: హైదరాబాదీలకు అదిరిపోయే న్యూస్.. దేశంలోనే అతిపెద్ద టన్నెల్ ఆక్వేరియం వచ్చేస్తోంది. ఎక్కడంటే..
ఐటీ, టూరిజం రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. దేశంలోని పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఆక్వేరియం మన భాగ్య నరగంలోనూ సందడి చేయనుంది. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తికాగా త్వరలోనే అందుబాటులోకి రానుంది...

ఐటీ, టూరిజం రంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. దేశంలోని పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన ఆక్వేరియం మన భాగ్య నరగంలోనూ సందడి చేయనుంది. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తికాగా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ ఆక్వేరియాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారు.? దీని ప్రత్యేకత ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లా్ల్సిందే..
దేశంలోనే అతిపెద్ద ఆక్వేరియంగా నిలవనున్న ఈ కట్టడాన్ని రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ నిర్మాణం పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. కొత్వాల్‌గూడలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎకో పార్క్‌లో ఈ ఆక్వేరియాన్ని నిర్మిస్తున్నారు. పక్షుల ఆవాస కేంద్రంగానూ దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఈ ఆక్వేరియం త్వరలోనే సందర్శకులకు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
We are building India’s largest Aquarium and Aviary at Kothwalguda. Work is in progress
Will have @arvindkumar_ias and @HMDA_Gov share pictures and details https://t.co/Jm1vs5EM2p
— KTR (@KTRBRS) April 17, 2023
హైదరబాద్‌లో టన్నెల్ ఆక్వేరియం ఎందుకు ఉండకూడదన్న ఓ నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మంత్రి కేటీఆర్.. ‘దేశంలోనే అతిపెద్ద అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియాన్ని నిర్మిస్తున్నాము. ప్రస్తుతం ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి’ అని రాసుకొచ్చారు. అలాగే ఈ నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేయాలని అధికారులు సూచించారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..




