DH Srinivas Rao: బ్రిటన్ నుంచి హైదరాబాద్‎కు వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలు.. జినోమ్ సీక్వెన్స్‎కు శాంపిల్స్..

బ్రిటన్ నుంచి హైదరాబాద్‎కు వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలున్నట్లు గుర్తించామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఆమె శాంపిల్స్‎ను జినోమ్ సీక్వెన్స్‎కు పంపించామని చెప్పారు...

DH Srinivas Rao: బ్రిటన్ నుంచి హైదరాబాద్‎కు వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలు.. జినోమ్ సీక్వెన్స్‎కు శాంపిల్స్..
Health Director Srinivas Rao
Follow us

|

Updated on: Dec 02, 2021 | 1:55 PM

బ్రిటన్ నుంచి హైదరాబాద్‎కు వచ్చిన మహిళకు ఒమిక్రాన్ లక్షణాలున్నట్లు గుర్తించామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఆమె శాంపిల్స్‎ను జినోమ్ సీక్వెన్స్‎కు పంపించామని చెప్పారు. విదేశాల నుంచి ఇప్పటి వరకు 325 మంది రాగా అందులో ఈ మహిళకు పాజిటివ్ వచ్చిందని.. ఆమెను టీమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లండించారు. నెగిటివ్ వచ్చిన వారికి వారం రోజుల తరువాత మరోసారి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 72 మంది ఏపీకి చెందిన వారు కాగా.. 239 తెలంగాణకు చెందిన వారిగా శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.

డిసెంబర్ చివరి వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. తెలంగాణలో గత నాలుగు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 25 దేశాలలో 215 కరోనా ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయన్నారు. ఒమిక్రాన్‎పై జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించిందని తెలిపారు. ఆఫ్రికాలో సరిగ్గా వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్లే కొత్త వెరియంట్ పుట్టుకొంచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మందికి మొదటి డోస్ పూర్తి అయిందని పేర్కొన్నారు. 47 శాతం మంది రెండో డోస్ తీసుకున్నారని తెలిపారు.

డిసెంబర్ చివరి వరకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. అందరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మాస్క్ ధరించకపోతే ఫైన్ వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పని ప్రదేశంలో, పబ్లిక్ ప్లేస్‎లో మాస్క్ తప్పని సరి లేకపోతే ఫైన్ విధిస్తా్మని హెచ్చరించారు. ఎక్కడికీ వెళ్లినా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకెళ్లండని సూచించారు. బయటకు వచ్చే వారికి వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసేలా ప్రభుత్వానికి సూచనలు చేస్తామని చెప్పారు.

Read Also.. Telangana: వేసింది పవిత్ర హనుమాన్‌ మాల.. చేస్తోంది మాత్రం నీచపు క్రీడ