PK team meet TRS: జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ చక్రం తిప్పనుందా..? సీఎం కేసీఆర్‌తో పీకే భేటీతో కొత్త చర్చ!
తెలంగాణ పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ పండితుడు అయిన ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ బృందం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో సందడి చేశారు.
PK team meet TRS Leaders in Hyderabad: టీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనుందా? ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం తర్వాత ఆ దిశగా అడుగులు పడే ఛాన్స్ ఉందా? అనువైన రాజకీయ పరిస్థితుల కోసం గులాబీ పార్టీ ఎదురు చూస్తోందా ? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా రైతాంగ సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు కేసీఆర్ సిద్దమయ్యారు. పార్లమెంటు వేదికగా టీఆర్ఎస్ ఎంపీలు సైతం నిరసన గళం వినిపిస్తున్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ పాలిటిక్స్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ పండితుడు అయిన ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ బృందం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో సందడి చేశారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తం రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. TRS… ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో పనిచేయనుందా? అన్న వార్తలు వినపడుతున్నాయి. నిన్న ప్రగతిభవన్‌లో ఐప్యాక్ ప్రతినిధులతో TRS నేతల సమావేశం కావడం ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారింది. జాతీయ రాజకీయ పరిణామాలు…ఈ మధ్య KCR చేసిన కామెంట్స్ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల అభిప్రాయాలు, సంక్షేమ పథకాలపై ఐప్యాక్ సర్వే చేయనున్నట్లు తెలుస్తోంది.. జాతీయస్థాయిలో TRSను ఫోకస్ చేసే పనిలో ఐప్యాక్ ఉన్నట్లు సమాచారం.
2 రోజుల క్రితం మమతాబెనర్జీతోనూ ప్రశాంత్ టీమ్ భేటీ అయింది. స్థానిక పార్టీల అధినేతలతో పీకే టీమ్ వరుస సమావేశాలు జరుపుతోంది. థర్డ్‌ఫ్రంట్ వేదిక కోసం మమత తరపున పీకే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది..కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్‌తో విబేధించిన పీకే… ఆ తర్వాత స్పీడ్ పెంచారు.. కాంగ్రెస్సేతర ప్రత్యామ్నాయంపై ఫోకస్.. చేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న మమతా బెనర్జీ కూడా కీలక కామెంట్స్ చేశారు. అసలు UPA ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు..
ఈ క్రమంలోనే బుధవారం తెలంగాణ సీఎం కేసీఆర్ మొబైల్‌లతో ప్రగతి భవన్‌లోకి వెళ్లి కేసీఆర్‌తో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తెరలేపింది. PAC నుండి వచ్చిన టీమ్, పోల్ మాంత్రికుడు ప్రశాంత్ కిషోర్ నడుపుతున్న టీమ్.. జాతీయ స్థాయిలో ఛట్రం తిప్పాలనుకుంటున్న టీఆర్ఎస్‌కు అవసరం చాలా ఉంది. కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఓటర్ల మానసిక స్థితిని అంచనా వేసేందుకు ఐపాక్ సభ్యులు సర్వేలు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 18 నెలల సమయం ఉన్నందున ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. తమ ప్రభుత్వానికి ఆదరణ తగ్గుతోందని ఆందోళన చెందుతున్నారని చెబుతున్న కేసీఆర్.. తన వైఫల్యాలకు గల కారణాలను అర్థం చేసుకోవాలన్నారు. అధికార వ్యతిరేకత మరింత వేగం పుంజుకుంటోందని భావిస్తున్న తరుణంలో పీకే టీమ్ సర్వే టీఆర్‌ఎస్‌కు ఎంతగానో కలిసిరానుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నిశితంగా విమర్శిస్తూ, దాని విధానాలను ప్రశ్నిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు ఇంటా, బయటా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన కనిపెట్టారు.
అలాగే. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలియాల్సి ఉంది. నిజానికి కొంతకాలం క్రితం ప్రశాంత్ కిషోర్ తో కేటీఆర్ సమావేశమయ్యారు. మహారాష్ట్రలో శరద్ పవార్‌తో పీకే హై ప్రొఫైల్ సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ సమావేశం జరిగింది. అప్పటి నుంచి ఆయన సేవలను టీఆర్‌ఎస్ అభ్యర్థించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, వైఎస్ షర్మిలకు ఇప్పుడు పీకే టీమ్ మెంబర్ ప్రియా సలహాలు, సహాయం చేస్తున్నారు. పీకే స్వయంగా కేసీఆర్‌కు సలహా ఇస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం పీకే టీం నుంచి సర్వే మద్దతును మాత్రమే కోరుతున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. తదుపరి సేవలు అవసరాన్ని బట్టి నిర్ణయిస్తారని చెబుతున్నాయి.
మరోవైపు. నిన్న కాంగ్రెస్‌ను మమతా బెనర్జీ టార్గెట్ చేస్తే ఇవాళ ఆమె సలహాదారు ప్రశాంత్‌కిశోర్ టార్గెట్ చేశారు. యుపీఏ ఎక్కడ ఉందని నిన్న బెంగాల్ సీఎం మమత విమర్శించారు. విపక్షాలకు పెద్దన్నగా ఉండడం హక్కు అని కాంగ్రెస్ ఎందుకు భావిస్తుందని అని ఇవాళ ప్రశాంత్ కిశోర్ ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 90 శాతం ఓడిపోయిందని విమర్శిస్తూ ట్వీట్ చేశారు పీకే. విపక్షాలకు నాయకత్వం వహించడం తమకు దేవుడు ఇచ్చిన హక్కు అని కాంగ్రెస్ భావిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు ప్రశాంత్ కిశోర్. విపక్షాలకు ఎవరు నేతృత్వం వహించాలో కాంగ్రెస్ నిర్ణయించాల్సిన అవసరం లేదు.. విపక్షాలే నిర్ణయించుకుంటాయని ట్వీట్ చేశారు ప్రశాంత్ కిశోర్.
The IDEA and SPACE that #Congress represents is vital for a strong opposition. But Congress’ leadership is not the DIVINE RIGHT of an individual especially, when the party has lost more than 90% elections in last 10 years.
Let opposition leadership be decided Democratically.
— Prashant Kishor (@PrashantKishor) December 2, 2021
Read also… Akhanda Movie: ఎల్లలు దాటిన అభిమానం.. డల్లాస్‌ను మోత మోగించిన బాలయ్య ఫ్యాన్స్..