Telangana: ప్రభుత్వం కీలక నిర్ణయం.. మాస్క్ లేకుంటే రూ.1000 ఫైన్.. అమల్లోకి కఠిన నిబంధనలు..
Not Wearing Mask: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన రేపుతోంది. ఇప్పటినుంచే అప్రమత్తంగా
Not Wearing Mask: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన రేపుతోంది. ఇప్పటినుంచే అప్రమత్తంగా లేకపోతే.. ఈ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఒమిక్రాన్ నియంత్రణకు ఇప్పటినుంచే చర్యలు ప్రారంభించాలని.. విదేశాల నుంచే వచ్చే ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించాలని కోరింది. ఈ మేరకు మార్గర్శకాలు సైతం విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరింత అప్రమత్తమైంది. కోవిడ్ కట్టడికి కఠిన చర్యలు అవలంభించాలని సీఎం కేసీఆర్ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. కరోనా మూడో ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనల్ని కచ్చితంగా పాటించాల్సిందేననని స్పష్టంచేశారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
అయితే.. బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని లేకుంటే.. వెయ్యి రూపాయల జరిమానాను విధించనున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఒమిక్రాన్ వైరస్ ఇప్పటికే 20కి పైగా దేశాలలో వ్యాపించిన నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో, ఆఫీసుల్లో మాస్క్ నిబంధన అమలయ్యేలా చూడాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. అదే విధంగా ప్రజలు ఎక్కడికి వెళ్లిన వ్యాక్సినేషన్ పత్రం తప్పనిసరిగా అమలయ్యేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుంచి మాస్క్ ధరించకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. గతం మాదిరి పరిస్థితి రాకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: