National Pension System: మీకు ఉద్యోగం లేకపోయినా పెన్షన్ వస్తుంది.. అదెలాగో తెలుసా..?

భారత ప్రభుత్వం ప్రత్యేక పథకం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో పెట్టుబడి పెట్టిన తర్వాత, మీరు 70 సంవత్సరాల తర్వాత పెన్షన్ ప్రయోజనం కూడా పొందుతారు.

National Pension System: మీకు ఉద్యోగం లేకపోయినా పెన్షన్ వస్తుంది.. అదెలాగో తెలుసా..?
National Pension System

National Pension System: మనమందరం మంచి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంటాం. అందుకే మనమందరం మన సంపాదనలో కొంత భాగాన్ని పొదుపు చేస్తాము. ఇందుకోసం భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక పథకం అందుబాటులో ఉంది. ఇందులో పెట్టుబడి పెట్టిన తర్వాత, మీరు 70 సంవత్సరాల తర్వాత పెన్షన్ ప్రయోజనం కూడా పొందుతారు. ఈ పథకం పేరు నేషనల్ పెన్షన్ స్కీమ్. ఈ పెన్షన్ వ్యవస్థ లక్ష్యం పెన్షన్ సంస్కరణలను ఏర్పాటు చేయడం,పౌరులలో పదవీ విరమణ కోసం పొదుపు అలవాటును పెంపొందించడం. మీరు ఈ పెన్షన్ విధానంలో పెట్టుబడి పెడితే, మీరు భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కోరు. దేశంలోని పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. రిటైర్‌మెంట్ తరువాత మెరుగైన ఆర్థిక భద్రతకు భరోసా ఇస్తుంది నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్టమ్ స్కీమ్‌ (NPS). ఇది కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన రిటైర్‌మెంట్ బెనిఫిట్ స్కీమ్‌ (Retirement Benefit Scheme). రిటైర్‌మెంట్ త‌ర్వాత ఎన్‌పీఎస్ ఖాతాదారుల‌కు రెగ్యుల‌ర్ ఇన్‌క‌మ్ అందించేందుకు దీన్ని ప్రారంభించారు. దీనికి ప్రభుత్వం మద్ద‌తు కూడా ల‌భిస్తుంది.

2004లో కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులందరికీ సంప్రదాయ పించను పద్ధతిని రద్దు చేసి కొత్త పించను పతాకాన్ని ప్రవేశ పెట్టింది. అదే జాతీయ పించను విధానము (నేషనల్ పెన్షన్ సిస్టం). తరువాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు తమ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టం లేదా ఎన్.పి.ఎస్ ను తప్పనిసరి చేశాయి. నేషనల్ పెన్షన్ సిస్టం సంప్రదాయ పించను విధానానికి చాలా భిన్నమైనది. ఇక్కడ ఒక ఉద్యోగి పించను ఎంత అనేది అతడు తన ఉద్యోగాకాలంలో ఎంత పించను నిధికి జమ చేసాడు, దానిపై ఎంత రాబడి వచ్చింది అనేదానిపై ఆధారపడి ఉంటుంది. 18 నుండి 70 సంవత్సరాల మధ్యవయస్కులు ఎవరైనా నేషనల్ పెన్షన్ సిస్టంలో సభ్యులుగా చేరవచ్చు. ఎన్.పి.ఎస్ ను పించను నిధి నియంత్రణ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పి.ఎఫ్.ఆర్.డి.ఎ.) నియంత్రిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టంలో రెండు ఖాతాలు ఉంటాయి – ఒక ప్రాథమిక టయర్-I ఖాతా, ఐచ్చిక టయర్ –II ఖాతా. టయర్-I ఖాతాలోని మొత్తాన్ని 65 సంవత్సరాలు నిండినంతవరకు ఉపసంహరించుకోవడం వీలుపడదు. టయర్ –II ఖాతా ఐచ్చికం. ఇందులో జమచేసే మొత్తాన్ని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, తిరిగి జమ చేయవచ్చు. ఈ ఖాతాలలో జమ చేయబడిన మొత్తాన్ని వివధ నిధి నిర్వాహకులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. ఈ విధంగా నేషనల్ పెన్షన్ సిస్టంలో భవిష్య నిధిలాగా నిర్ణీత వడ్డీ, నిర్ణీత రాబడి ఉండదు. ఎన్.పి.ఎస్ పై వచ్చే రాబడి స్టాక్ మార్కెట్ల కదలికలపై, సూచీల గమనంపై ఆధారపడి ఉంటుంది

నేషనల్ పెన్షన్ సిస్టమ్ పట్ల దేశవ్యాప్తంగా చాలా మందిలో ఉత్సాహం ఉంది. ఇది చాలా ప్రయోజనకరమైన పథకం. ఈ పథకం సహాయంతో, మీరు మీ వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మీరు స్వతంత్ర జీవితాన్ని గడపగలుగుతారు. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్‌లో ఖచ్చితమైన రాబడులు అందుతాయి. రాబడిపై వడ్డీ రేటు 9 నుండి 12 శాతం వరకు ఉంటుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద 4 రంగాలు ఉన్నాయి. వాటి ద్వారా మీరు మీ ఖాతాను తెరవవచ్చు.

►కేంద్ర ప్రభుత్వం – ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం. ►రాష్ట్ర ప్రభుత్వం – ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం. ►కార్పొరేట్ రంగం – ఇది ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగుల కోసం. ►అన్ని సిటిజన్ మోడల్ – ఇందులో మీరు మీ స్వంత NPS ఖాతాను తెరవవచ్చు.

NPS పథకంలో మీరు పొందే మొత్తం సంపద, పెన్షన్ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈక్విటీ మార్కెట్‌ పనితీరు ఎలా ఉంది? లేదా మీ వయస్సు ఎంత? 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉన్న ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. మీరు NPSలో ఆన్‌లైన్‌లో సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. మరోవైపు, మీకు బ్యాంకులో ఎన్‌పిఎస్ ఖాతా ఉంటే, మీరు బ్యాంకు వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు.

అయితే ఇటీవల పెన్షన్‌ నిధి నియంత్రణ సంస్థ పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ ఆర్డీఏ) కొన్ని నిబంధనల్ని సడలించింది.

సడలించిన నిబంధనలు ►పీఎఫ్‌ ఆర్డీఏ సడలించిన నిబంధనల ప్రకారం..ప్రభుత్వ ఉద్యోగులు సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద సూచించిన ప‌రిమితి వ‌ర‌కు ఎన్‌పీఎస్‌లో అద‌నంగా రూ.50,000 వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ►ఎన్‌పీఎస్ అకౌంట్‌లో జ‌మ‌చేసే సొమ్ము మొత్తంలో రిటైర్‌మెంట్‌కు ముందు 25 శాతం దాకా తీసుకోవ‌చ్చు ►రిటైర్మెంట్‌ తర్వాత ఎన్‌పీఎస్‌లో జ‌మ‌య్యే నిధిలో 60 శాతం మేర‌కు ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తిస్తుంది. మ‌రో 40 శాతం యాన్యుటీ కొనుగోలుకు వెచ్చించాలి. ►గడువుకు ముందే ఎవరైనా ఎన్‌పీఎస్‌ నుంచి బయటకు రావాలనుకుంటే.. ఇప్పటి వరకూ ఉన్న రూ.లక్ష పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచింది. ►ఎన్‌పీఎస్‌లో చేరే వయసు ఇప్పటివరకూ 65 ఏళ్లు ఉండగా.. దీన్ని 70 ఏళ్లకు పెంచారు. ►ఎవ‌రైనా 65 సంవ‌త్సరాల త‌ర్వాత ఎన్‌పీఎస్‌లో చేరితే, క‌నీసం 3ఏళ్ల పాటు కొనసాగాలి. ►ఒక‌వేళ 65 ఏళ్ల త‌ర్వాత ఎన్‌పీఎస్‌లో చేరి..3 సంవ‌త్సరాల ముందే విత్‌డ్రా చేయాల‌నుకుంటే..జమ చేసిన మొత్తంలో 20% వ‌ర‌కు మాత్రమే పన్నుర‌హిత ఉప‌సంహ‌ర‌ణను అనుమ‌తిస్తారు. మిగ‌తా మొత్తం జీవిత‌కాలం పెన్షన్‌గా ఉంటుంది.

Read Also…. Wife Kidnaped: తాళి కట్టిన భార్యనే స్నేహితులతో కలిసి కిడ్నాప్.. అసలు విషయం తెలిస్తే షాక్!

Click on your DTH Provider to Add TV9 Telugu