Silk Smitha: కుర్రకారు కలల రాణి.. ఆమె పేరు ఓ సమ్మోహనాస్త్రం.. చెరిగిపోని స్వప్నం.. సిల్క్ స్మిత జయంతి నేడు..

Silk Smitha: కుర్రకారు కలల రాణి.. ఆమె పేరు ఓ సమ్మోహనాస్త్రం.. చెరిగిపోని స్వప్నం.. సిల్క్ స్మిత జయంతి నేడు..
Silk Smitha

Silk Smitha: ఆ పేరు ఓ సమ్మోహనాస్త్రం. కొన్ని లక్షల హృదయాలను రసడోలికలలో ఊపిన చెరిగిపోని స్వప్నం. 80, 90ల్లో దక్షిణాది కుర్రకారుకు కలల రాణిగా మారి నిద్రను అమితంగా..

Surya Kala

|

Dec 02, 2021 | 11:24 AM

Silk Smitha: ఆ పేరు ఓ సమ్మోహనాస్త్రం. కొన్ని లక్షల హృదయాలను రసడోలికలలో ఊపిన చెరిగిపోని స్వప్నం. 80, 90ల్లో దక్షిణాది కుర్రకారుకు కలల రాణిగా మారి నిద్రను అమితంగా ఇష్టపడేలా చేసిన సిల్క్ స్మిత 61వ జయంతి నేడు.. నిషాకళ్లతో ఒకప్పడు సౌత్ సినిమా కమర్సియాలిటీకి కేరాఫ్ గా నిలిచిన అందమైన స్వప్నం సిల్క్ స్మిత.

సిల్క్ స్మిత ప్రముఖ దక్షిణాది నటి.  తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషలలో 200లకు పైగా సినిమాల్లో నటించింది. హీరో ఎవరు అనేది సెకండరీ, ఫస్ట్ సినిమాలో సిల్క్ స్మిత పాటుందా? లేదా? ఎలాంటి కథైనా సిల్క్ ను చేర్చాల్సిందే! 80,90ల్లో కొన్ని లక్షల మంది డిమాండ్స్ ఇవి. బయ్యర్లు అయితే సిల్క్ తో సై సయ్యా..అని స్టెప్పేయించకపోతే ఆ సినిమా మేం తీసుకోం అని అల్టిమేటమ్ జారీ చేసేవారు. వెండితెర కూడా ఈ వాదనలకు తెగ సంబరపడిపోయి సిగ్గుమొగ్గలు వేసేది అంటే అతి శయోక్తి కాదు అని అప్పటి కుర్రకారు తెగ ఆనందంగా చెప్తారు.

సిల్క్ స్మిత షూటింగ్ జరుగుతోంది అంటే అక్కడ ఫుల్ బందోబస్త్ ఉండాలి. ఆమెను క్యాప్చర్ చెయ్యడానికి కెమెరాకు ఒళ్లంత కల్లుండాలి. అదీ దక్షిణాది సినీ సీమలో సిల్క్ స్మిత రేంజ్. విజయలక్ష్మి గా ఎంట్రీ ఇచ్చి వంది చక్కరమ్ సినిమాతో సిల్క్ గా సిల్వర్ స్క్రీన్ కు హాట్ ఇమేజ్ అద్దింది. ఆ తర్వాత స్టార్ హీరోస్ కూడా ఆమెతో స్టెప్పెయ్యడానికి వెయిట్ చెయ్యాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో విజయలక్ష్మి 1960, డిసెంబరు 2న జన్మించింది. 4వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పి సినీనటి కావాలని మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది. కెరీర్ ని హీరోయిన్ గా మొదలు పెట్టి అనంతరం వ్యాంప్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఐటెం సాంగ్స్ తో దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. సిల్క్ స్మిత మొదటి చిత్రం తమిళంలో వండి చక్రం (బండి చక్రం). 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్. అనంతరం విజయలక్ష్మి సిల్క్ స్మిత గా మారింది.

సిల్క్ స్మిత పాటలకు ధియేటర్లు ఊగిపోయేవి. చిల్లర పైసలు, పూల బుట్టలతో ధియేటర్లు నిండిపోయేవి. స్టార్ హీరోయిన్స్ కంటే, ఆ మాటకొస్తే టాప్ హీరోలనే తలదన్నేలా సిల్క్ కు ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చేసింది. ఆ ఇమేజ్ తో సిల్క్ సౌత్ హాట్ క్వీన్ గా మారింది. అప్పటికే ఉన్న జ్యోతిలక్ష్మి, జయమాలిని లాంటి వాళ్లను వెనక్కి నెట్టి సెక్స్ బాంబ్ గా మారిన సిల్క్ తర్వాత వచ్చిన కొత్తతరాన్ని ఎదుర్కోవడానికి నిర్మాతగా మారి ఆర్దికంగా నష్టపోవడం, ఇండస్ట్రీలోని ఓ స్టార్ హీరో మోసం చెయ్యడంతో సిల్క్ తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది. ఆమె మరణించి దాదాపు 25 ఏళ్ళు గడిచినా ఈరోజు మరణం ఓ మిస్టరీగా నే మిగిలిపోయింది. స్మిత జీవనతెరను విడిచి ఏళ్ళు గడుస్తున్నా.. ఇప్పటికీ సిల్క్ అనే పేరు వింటే తెలుగు ప్రేక్షకులు పులకించిపోతున్నారంటే అర్దం చేసుకోవచ్చు. ఆ పేరుకు ఎప్పటికీ మరణం లేదని. అందుకే ఆమె కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. సూపర్ హిట్స్ అవుతున్నాయి.

Also Read: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ముల్లంగి ఆకులు, మొక్కజొన్న పీచు సహజ ఔషధాలు.. ఎలా ఉపయోగించాలంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu