Bandi Sanjay Arrest: బండి సంజయ్ అరెస్టు.. పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట.. ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ను పోలీసులు అరెస్టు చేశారు. తమ పార్టీ నేతలపై దాడులకు నిరసిస్తూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జనగామ (Janagaon) జిల్లాలోని...

Bandi Sanjay Arrest: బండి సంజయ్ అరెస్టు.. పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట.. ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు..
Bandi Sanjay
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 23, 2022 | 11:11 AM

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ను పోలీసులు అరెస్టు చేశారు. తమ పార్టీ నేతలపై దాడులకు నిరసిస్తూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జనగామ (Janagaon) జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ మండలం పామ్నూర్ లో బండి సంజయ్ దీక్ష తలపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు బండి సంజయ్ దీక్షను భగ్నం చేశారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసు వాహనాన్ని ముందుకు వెళ్లనీయకుండా పార్టీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా.. బీజేపీ నేతలపై దాడులకు నిరసనగా బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తం ఆందోళనలకు పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందంటూ వార్తలు వచ్చాయి. దీంతో పార్టీ నేతలు కవిత ఇంటి ముందు నిరసన చేశారు. దీంతో పోలీసులు అలర్టై వారిని అరెస్టు చేశారు. అంతే కాకుండా వారిపై కేసులు నమోదు చేశారు. లిక్కర్‌ స్కామ్‌పై నిజాలు తేల్చెంత వరకు ఎవరినీ వదిలిపెట్టేది లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. కుంభకోణం వెనుక కవిత హస్తం ఉందని, మద్యం వ్యాపారంలో కమీషన్ల కోసం ఆమె ఇందులో పాల్గొన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం