Telangana DGP: సిక్ లీవ్‌లో డీజీపీ.. అంజనీ కుమార్‌కు అదనపు బాధ్యతలు..!
తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ ఎం మహేంద్ర రెడ్డి(DGP M Mahendra Reddy) సిక్‌లీవ్ తీసుకున్నారు. పదిహేను రోజులపాటు ఆయన సెలవులో ఉండనున్నారు.
Telangana Police: తెలంగాణ పోలీస్ బాస్ డీజీపీ ఎం మహేంద్ర రెడ్డి(DGP M Mahendra Reddy) సెలవుపై వెళ్లనున్నారు. ఆయన మెడికల్ గ్రౌండ్స్‌లో సిక్ లీవ్ అప్లై చేసుకోవడంతో 15 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 04 వరకు ఆయన సెలవుల్లో ఉండనున్నారు. దీంతో 15 రోజుల పాటు తెలంగాణ ఏసీబీ డీజీగా పనిచేస్తున్న అంజనీ కుమార్(Anjani Kumar)కు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించడంతో 15 రోజుల పాటు డీజీపీగా వ్యవహరించనున్నారు.