నువ్వే జీవితమన్నాడు.. అందంగా లేవని వేధించాడు.. చివరికి.. ?

ప్రేమించానన్నాడు. నువ్వే ప్రాణమన్నాడు. నిన్ను వదిలి ఉండలేనన్నాడు. జీవితాంతం తోడై ఉంటానని బాస చేశాడు. ఆ మాటలు నమ్మిన యువతి పెళ్లికి ఒప్పుకుంది. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు...

నువ్వే జీవితమన్నాడు.. అందంగా లేవని వేధించాడు.. చివరికి.. ?
Death
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 18, 2022 | 9:55 PM

ప్రేమించానన్నాడు. నువ్వే ప్రాణమన్నాడు. నిన్ను వదిలి ఉండలేనన్నాడు. జీవితాంతం తోడై ఉంటానని బాస చేశాడు. ఆ మాటలు నమ్మిన యువతి పెళ్లికి ఒప్పుకుంది. పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. కడదాకా కలిసుంటానని ప్రమాణం చేసి.. మూడు సంవత్సరాలు గడవకముందే తన ప్రబుద్ధిని బయటపెట్టాడు ఓ భర్త. తన భార్య అందంగా లేదంటూ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో భర్త వేధింపులు తాళలేక ఆ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తి గ్రామానికి చెందిన మహేష్.. యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన సునీతను ప్రేమించాడు. వీరి విషయం పెద్దలకు తెలిసింది. ఇరువురి కుటుంబీకుల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు.

కొన్ని నెలలు సజావుగా సాగిన వీరి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. మహేష్ తన భార్యను అందంగా లేవని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో సునీత వేధింపులు తాళలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహేష్ సునీతను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురి చేసేవాడని సునీత బంధువులు ఆరోపించారు. తన చెల్లెలు మృతికి మహేష్ కారణమంటూ సునీత సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Also Read

అమ్మా బయటకు వెళ్లొస్తామన్నారు.. విగతజీవిగా మారారు.. అసలేం జరిగిందంటే..?

AP Crime: చిచ్చు రేపిన ఆర్థిక విభేదాలు.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య.. భర్త మృతిని తట్టుకోలేక..

పేగు బంధాన్ని మరిచిన కుమారుడు.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిపై విచక్షణా రహితంగా..