అమ్మా బయటకు వెళ్లొస్తామన్నారు.. విగతజీవిగా మారారు.. అసలేం జరిగిందంటే..?
వారిద్దరూ స్నేహితులు. సరదాగా సైకిల్ పై బయటకు వెళ్లొస్తామని చెప్పి ఇంట్లో నుంచి బయల్దేరారు. స్థానికంగా ఉన్న పెన్నా కాజ్ వే వద్ద కు వెళ్లారు. ఈత కొట్టేందుకు నదిలో దిగారు. ప్రమాదవశాత్తు నీట..
వారిద్దరూ స్నేహితులు. సరదాగా సైకిల్ పై బయటకు వెళ్లొస్తామని చెప్పి ఇంట్లో నుంచి బయల్దేరారు. స్థానికంగా ఉన్న పెన్నా కాజ్ వే వద్ద కు వెళ్లారు. ఈత కొట్టేందుకు నదిలో దిగారు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాతపడ్డారు. విషయం తెలియని తల్లిదండ్రులు.. చిన్నారుల కోసం అంతటా గాలించారు. పోలీసులనూ ఆశ్రయించారు. చివరగా పెన్నా బ్రిడ్జి వద్ద సైకిల్ ను గమనించిన పోలీసులు.. గజఈత గాళ్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. బయటకు వెళ్లొస్తామని చెప్పి, బయటకు వెళ్లిన చిన్నారులు విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు శోకతప్తమయ్యారు. ఈ ఘటన కడప(Kadapa) జిల్లా సిద్ధవటం(Siddavatam) లో జరిగింది.
కడప జిల్లాలోని సిద్దవటం రత్నసభాపతి నగర్‌కు చెందిన శ్రీరాములు, జ్యోతి అనే దంపతులు నివాసముంటున్నారు. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె సంతానం. జీవనోపాధి కోసం శ్రీరాములు గల్ఫ్ వెళ్లారు. వీరి బంధువైన శేఖర్, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. ఈయన స్థానికంగా కూలీ చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. శ్రీరాములు మొదటి కుమారుడు సతీశ్, శేఖర్ రెండో కుమారుడు బాలాజీ, పాఠశాల వద్దకు వెళ్లి వస్తామని చెప్పి పెన్నా లోలెవెల్ కాజ్‌వే వద్దకు వెళ్లారు. రాత్రయినా వారు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిందండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కలా గాలించారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పెన్నానది లో లెవెల్ కాజ్‌వేపై చిన్నారుల సైకిల్ ఉండడంతో నదిలో ఈతకు వెళ్లి గల్లంతై ఉంటారని పోలీసులు అనుమానించారు. స్థానిక పోలీసులు ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. నీటి మడుగులో చిక్కుకుని ఉన్న ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ఈతగాళ్లు వల ద్వారా గురువారం బయటకు తీశారు. మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. శవపరీక్ష కోసం చిన్నారుల డెడ్ బాడీలను ఆస్పత్రికి తరలించారు.
Also Read
Zodiac Signs: ఈ వ్యక్తులను అస్సలు నమ్మకూడదు.. నమ్మకద్రోహం చేయడంలో ముందుంటారు..
Bheemla Nayak : సెన్సార్ పూర్తి చేసుకున్న పవర్ స్టార్ ‘భీమ్లానాయక్’..